Samantha: అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌

Updated on: Dec 05, 2025 | 1:37 PM

స్టార్ హీరోయిన్ సమంత, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహం డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఇషా ఆశ్రమంలో ఆధ్యాత్మిక వాతావరణంలో నిరాడంబరంగా జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, అత్తవారింట్లో సమంతకు అద్భుత స్వాగతం లభించింది. రాజ్ సోదరి శీతల్ నిడిమోరు ఎమోషనల్ పోస్ట్‌తో తమ కుటుంబంలోకి ప్రేమగా ఆహ్వానించగా, సమంత స్పందన హృదయాలను హత్తుకుంది. ఈ నూతన జంటకు సినీ ప్రముఖులు, అభిమానుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

స్టార్‌ హీరోయిన్‌ సమంత వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. ప్రముఖ దర్శక-నిర్మాత రాజ్ నిడిమోరుతో డిసెంబరు 1న ఆమె వివాహం జరిగింది. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తలకు తెరదించుతూ, కోయంబత్తూరులోని ఇషా ఆశ్రమంలో వీరి పెళ్లి వేడుక ఆధ్యాత్మిక వాతావరణంలో నిరాడంబరంగా జరిగింది. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇక డిసెంబర్‌ 2న సమంతకు అత్త వారింట్లో గ్రాండ్‌ వెల్‌కమ్‌ లభించింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, రాజ్ కుటుంబంతో సమంత దిగిన ఒక ఫ్యామిలీ ఫొటో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రాజ్ సోదరి శీతల్ నిడిమోరు ఈ ఫొటోను పంచుకుంటూ, ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. తమ ఫ్యామిలీలోకి సమంతను ఆహ్వానిస్తూ.. ఎప్పుడూ తనకు అండగా ఉంటానని తెలిపారు. శివుడి ఆధ్వర్యంలో ఈ పెళ్లి జరగడం ఆనందంగా ఉందని, ఆనందంతో తన హృదయం ఉప్పొంగుతోందని పేర్కొన్నారు. ఇవాళ మా కుటుంబం పరిపూర్ణమైంది… సమంత- రాజ్ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకుసాగుతుండడం చూసి తమకు గర్వంగా ఉందన్నారు. తాము వీరికి ఎప్పుడూ అండగా ఉంటామని రాసుకొచ్చారు. ఈషా ఫౌండేషన్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ పోస్ట్‌కు సమంత స్పందిస్తూ.. ‘లవ్‌ యూ’ అని రిప్లై పెట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bigg Boss Telugu: బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

Ritu Choudhary: భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

TOP 9 ET News: రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!