Samantha: లక్షలో నలుగురికి మాత్రమే వచ్చే వ్యాధి..
వాటర్ బక్కెట్టే కాదు... వాటర్ బాటిల్ ఎత్తాలన్నా కష్టమే. వాటర్ బాటిల్ ఎత్తడమే కాదు.. కాస్త దూరం నడవాలన్నా భారమే.. ! కూర్చోలన్నా.. పడుకోవాలన్నా..
వాటర్ బక్కెట్టే కాదు… వాటర్ బాటిల్ ఎత్తాలన్నా కష్టమే. వాటర్ బాటిల్ ఎత్తడమే కాదు.. కాస్త దూరం నడవాలన్నా భారమే.. ! కూర్చోలన్నా.. పడుకోవాలన్నా.. చివరికి చిన్నా చితకా పనులు చేయాలన్నా నరకయాతనే..! అలాంటి అరుదైన వ్యాధే సమంతకొచ్చిన వ్యాధి. లక్షల్లో నలుగురికి మాత్రమే వచ్చే వ్యాధి. ఎస్ ! సమంత తన పోస్ట్‌లో పేర్కొన్న ‘మయోసైటిస్’ అనేది కండరాలకు సంబంధించిన అరుదైన వ్యాధి. ఇది ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్. ఒక మాటలో చెప్పాలంటే కీళ్లవాతం లాగే దీన్ని కండరాల వాతం అనుకోవచ్చు. ఈ మయోసైటిస్ వ్యాధిలో మన రోగనిరోధక శక్తి మన శరీర కండరాల పైనే దాడిచేసి వాటిని కదలకుండా చేస్తుంది. తొలి దశలో గుర్తించకపోతే ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఈ సమస్యతో బాధపడేవారి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంటుంది. ఈ వ్యాధిలో పలు రకాలు ఉన్నాయి. బరువులు ఎత్తడానికి కూడా సాధ్యం కాని పరిస్థితి వస్తే, అది కూడా మధ్య వయస్కుల్లో ప్రతి రోజూ కనిపిస్తే అది ‘మయోసైటిస్’ లక్షణంగా భావించాల్సి ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: ఆగిపోయిన ఆదిపురుష్ రిలీజ్ | స్టార్ యాంకర్ FB స్టేటస్‌లో బూతు వీడియోలు