Salaar vs Dunki: సలార్ Vs డంకీ.. నార్త్‌లో విన్నర్‌ ఎవరు.? షాకింగ్ రిజల్ట్‌.

|

Dec 27, 2023 | 11:54 AM

షారుఖ్‌ ఖాన్‌, ప్రభాస్‌.. సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్‌ డమ్ ఉన్న స్టార్‌ హీరోలు. షారుఖ్‌ ఖాన్‌ ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. అదే సమయంలో ప్రభాస్‌ మాత్రం అతి తక్కువ కాలంలో పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా మారిపోయాడు. ఓ రేంజ్‌లో ఫ్యాన్స్‌ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అలాంటి ఈ సూపర్‌ స్టార్లిద్దరి సినిమాలు రిలీజ్‌ అయితే ఫ్యాన్స్‌కు పండగేగా.. సలార్‌, డంకీ సినిమాలు రిలీజ్ అయి చేసింది ఇదేగా..!

షారుఖ్‌ ఖాన్‌, ప్రభాస్‌.. సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్‌ డమ్ ఉన్న స్టార్‌ హీరోలు. షారుఖ్‌ ఖాన్‌ ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. అదే సమయంలో ప్రభాస్‌ మాత్రం అతి తక్కువ కాలంలో పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా మారిపోయాడు. ఓ రేంజ్‌లో ఫ్యాన్స్‌ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అలాంటి ఈ సూపర్‌ స్టార్లిద్దరి సినిమాలు రిలీజ్‌ అయితే ఫ్యాన్స్‌కు పండగేగా… సలార్‌, డంకీ సినిమాలు రిలీజ్ అయి చేసింది ఇదేగా..! అయితే ఈ సందడిలోనే…చిన్న పాటి చర్చ…! థియేటర్ల కేటాయింపు… ఫ్యాన్ వార్స్‌..తో అట్టుడికింది నెట్టంట. మరి ఈ వార్‌లో నార్త్‌లో క్లియర్ కట్ విజేతలెవరు.. ఎవరి సినిమా ఎక్కువ థియేటర్లను, కలెక్షన్స్‌ను దక్కించుకుందని అంటే… డంకీ అనే మాటే.. బాలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది. సలార్‌, డంకీ సినిమాల రిలీజ్‌ డేట్లు ప్రకటించినప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎవరో ఒకరు తమ సినిమాను వాయిదా వేసుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే అప్పటికే సలార్‌ రిలీజ్‌ పలు సార్లు వాయిదా పడడంతో ప్రభాస్‌ సినిమాను కచ్చితంగా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి. డంకీది కూడా.. దాదాపు అదే పరిస్థితి.

అదే సమయంలో డంకీ డైరెక్టర్‌ రాజ్‌ కుమార్‌ హిరాణీ కూడా ఈ క్లాష్‌పై స్పందించాడు. ఒకేసారి రెండు భారీ సినిమాలు రిలీజ్‌ చేస్తే ఎవరో ఒకరు నష్టపోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చాడు. ఆయన అనుకున్నదే జరిగింది. నార్త్‌లో డంకీ సినిమాకు భారీగా థియేటర్లు బుక్‌ అయ్యాయి. సలార్‌ సినిమాకు మాత్రం థియేటర్లు దొరక్కలేదు. ముఖ్యంగా పీవీఆర్‌ ఐనాక్స్‌, మిరాజ్‌ థియేటర్లన్నీ షారుక్‌ సినిమానే ప్రదర్శించాయి. ఇదే సలార్‌ టీమ్‌కు ఆగ్రహం తెప్పించింది. దీంతో సౌత్‌లో పీవీఆర్‌ ఐనాక్స్‌, మిరాజ్‌ థియేటర్లలో సలార్‌ సినిమాను రిలీజ్‌ చేయబోమని ప్రకటించింది. ఇది రెండు సినిమాల కలెక్షన్లపై ప్రభావం చూపించింది. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా మొదటి రెండు రోజులు సలార్‌కు నార్త్‌లో పెద్దగా కలెక్షన్లు రాలేదు. అదే సమయంలో నెగెటివ్‌ టాక్‌ కారణంగా డంకీ సినిమా కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. అయినా కానీ… సలార్ కంటే.. డంకీకి నార్త్‌లో రెస్పాన్స్‌ బాగుందనేది బాలీవుడ్ మీడియా మాట. అదే తమ ఆర్టికల్స్‌లో కోట్ చేస్తూ మరీ చెబుతోంది… డంకీ దే పై చేయి అనే మాట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.