Salaar Piracy: సలార్ పైరసీ ప్రింట్ కనిపిస్తే వెంటనే ఇలా చేయండి.. ప్రొడ్యూసర్స్ రిక్వెస్ట్.

|

Dec 23, 2023 | 1:31 PM

బాహుబాలి తర్వాత సలార్ సినిమాతో ఆ రేంజ్ హిట్ అందుకున్నాడు ప్రభాస్. డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చింది. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు నీల్. ఇందులో ప్రభాస్ ఊరమాస్ లుక్‏లో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్‏తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇప్పటికే థియేటర్లలో రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్.

బాహుబాలి తర్వాత సలార్ సినిమాతో ఆ రేంజ్ హిట్ అందుకున్నాడు ప్రభాస్. డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చింది. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు నీల్. ఇందులో ప్రభాస్ ఊరమాస్ లుక్‏లో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్‏తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇప్పటికే థియేటర్లలో రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండడంతో పైరసీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు మేకర్స్. దీంతో ప్రభాస్ అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు.

సలార్ సినిమాకు సంబంధించిన పైరసీ ఎక్కడైనా కనిపిస్తే తమ యాంటీ పైరసీ టీంకు తెలియజేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ట్విట్టర్ లో ఈ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన సీన్లను ఎవరైనా పోస్ట్ చేసినా తమకు తెలియజేయాలని కోరారు. ట్విట్టర్ లో మీరు పైరసీ కంటెంట్ చూస్తే X@BLOCKXTECHS అంటూ రీ ట్వీట్ చేయాలని అన్నారు. అలాగే ఏదైనా పైరసీ సైట్స్ లో సలార్ మూవీ లేదా సినిమాకు సంబంధించిన ఏ విషయం కనిపించినా REPORT@BLOCKXTECH.COM అనే మెయిల్ కు మెసేజ్ చేయాలని కోరారు నిర్మాతలు.

ఈ సినిమాను భారీ బడ్జెట్‏తో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత రాధేశ్యామ్, సాహో, ఆదిపురుష్ ప్రభాస్ నటించిన సినిమాలు. ఇప్పుడు వీటి తరువాత వచ్చిందే సలార్. అందుకే ఫ్యాన్స్ ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నారు. ఈక్రమంలో ఇప్పుడు సలార్ చిత్రానికి బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్ వస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. సలార్ సినిమా కంటెంట్ ఎక్కడైనా పైరసీ జరిగినట్లు కనిపిస్తే వాటిని తొలగించేలా ఈ రెండు విషయాలను ఫాలో అయిపోండి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.