Sai Pallavi: మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్
సాయి పల్లవి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నార్త్, సౌత్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ నటి, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ ప్రతిష్టాత్మక పాత్రను పోషించనున్నారు. రాజినీకాంత్, ధనుష్ చిత్రాల్లోనూ ఆమె కనిపించనున్నారు. నార్త్ లో క్రేజీ భామలందరూ బయోపిక్స్ లో నటిస్తుంటే, సౌత్ బ్యూటీస్ మాత్రం ఆ కాన్సెప్ట్ కి దూరదూరంగా ఉంటున్నారంటూ నిన్న మొన్ననే డిస్కషన్ జరిగింది.
నార్త్ లో క్రేజీ భామలందరూ బయోపిక్స్ లో నటిస్తుంటే, సౌత్ బ్యూటీస్ మాత్రం ఆ కాన్సెప్ట్ కి దూరదూరంగా ఉంటున్నారంటూ నిన్న మొన్ననే డిస్కషన్ జరిగింది. అలా ఎందుకు అనుకోవడం.. నేనున్నాగా… నేను ఆ లోటును భర్తీ చేస్తానంటూ ముందుకొచ్చేస్తున్నారట సాయిపల్లవి. ఇంతకీ ఈ బ్యూటీ ఏం చేయబోతున్నారు? సౌత్ ఆడియన్స్ కి దూరంగా, నార్త్ జనాలకు దగ్గరగా ఉంటున్నారు సాయిపల్లవి అంటూ ఈ మధ్య జనాలు తెగ మాట్లాడుకుంటున్నారు. నార్త్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు సైన్ చేయడంతో ఈ మాటలు వైరల్ అయ్యాయి. అయితే అందులో నిజం లేదు… సౌత్‌లో నా బేస్‌ని నేనెప్పుడూ మర్చిపోను అంటున్నారు పల్లవి. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్‌కి ఈమె లేటెస్ట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది టాక్. సెన్సిబుల్ పాయింట్స్ ని పక్కాగా డీల్ చేస్తారనే పేరున్న గౌతమ్ తిన్ననూరి ఈ ప్రాజెక్టును టేకప్ చేస్తున్నారన్నది వైరల్ న్యూస్. ఆల్రెడీ నార్త్ లో రామాయణలో నటిస్తున్న పల్లవి, సౌత్‌లో కమల్‌హాసన్ ప్రొడక్షన్‌లో రజనీకాంత్ మూవీకి కూడా సైన్ చేశారట. అలాగే ధనుష్ తోనూ మరోసారి జోడీ కట్టడానికి రెడీ అయ్యారన్నది న్యూస్. ఇప్పుడు వార్తల్లో ఉన్న సినిమాలన్నీ పట్టాలెక్కితే మాత్రం ది మోస్ట్ బిజీ హీరోయిన్‌గా మారిపోతారు సాయిపల్లవి. ఆచితూచి ప్రాజెక్టులు చేసే పల్లవిలో పెర్ఫార్మర్ నచ్చడంతోనే ఇన్ని ప్రాజెక్టులు ఆమెవైపు అడుగులేస్తున్నాయని సంబరాలు చేసుకుంటున్నారు లేడీ పవర్‌స్టార్ ఫ్యాన్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెద్ది తెలుగు రికార్డులను కొల్లగొట్టిన పవన్ కల్యాణ్
మార్చి యుద్ధం.. 2 వారాల్లో 4 పాన్ ఇండియా సినిమాలు
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
Vijayawada: బెజవాడ రైల్వే స్టేషన్‌లో పార్కింగ్ దోపిడీ
డీమాన్‌ని ఢీ కొట్టి బొక్కబోర్లా పడ్డ కళ్యాణ్.. తనూజ దెబ్బకు షాక్‌లోకి
