ఓజీ సినిమా మొదటి టికెట్‌ ధర అక్షరాలా రూ.లక్ష.. ఎందుకంటే

Updated on: Sep 21, 2025 | 8:01 PM

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. అతని ఆలోచనలకు తగ్గట్టుగానే అతని అభిమానులు కూడా ఉండాలని కోరుకునే విలక్షణ నటుడు. తన నటనతో అశేష అభిమానులను సంపాదించుకున్న పవన్‌ తాజాగా ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సెప్టెంబర్‌ 25న విడుదల అవుతున్న ఈ సినిమా మొదటి టికె్‌ ఊహించని ధర పలికింది.

పవన్‌ కళ్యాణ్‌ అభిమాని, జనసేన కార్యకర్త అయిన శ్రీరామలోచన్‌ అనే వ్యక్తి పవన్‌మీద అభిమానంతో ఆ సినిమా మొదటి టికెట్‌ తనే కొనుగోలు చేయాలనుకున్నారు. అనుకున్నట్టుగానే ఏకంగా లక్షరూపాయలు వెచ్చించి మొదటి షో మొదటి టికెట్‌ను కొనుగోలు చేశారు. ఆ సొమ్మును ఏదైనా సామాజిక కార్యక్రమానికి ఉపయోగించాలని థియేటర్‌ యజమానిని కోరారు. థియేటర్‌ యజమాని పవన్‌ కూడా పవన్‌ కళ్యాణ్‌ అభిమాని కావడంతో శ్రీరామలోచన్‌ ప్రతిపాదన అతనికి నచ్చి మొదటి టికెట్‌ను అతనికి లక్ష రూపాయలకు విక్రయించారు. ఆ నగదును చిత్తూరు జిల్లా రూరల్‌లోని నాయిని గ్రామాభివృద్ధికి ఖర్చుచేయాలన్న శ్రీరామలోచన ఆలోచనకు పవన్‌ అంగీకరించారు. చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీరామలోచన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయన తండ్రి పురుషోత్తం బాపట్లలో డీఈఓగా పనిచేస్తున్నారు. చిత్తూరు జనసేన కార్యకర్తగా శ్రీరామలోచన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. అంతేకాదు ప్రతి ఏటా పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటారు. చిత్తూరులో ఓజి సినిమా ప్రదర్శించబోతున్నరాఘవ థియేటర్ యజమాని పవన్ కు రూ. లక్ష డి డి ని అందజేశారు. ఈ మొత్తం చిత్తూరు రూరల్ లోని నాయిని చెరువు గ్రామాభివృద్ధికి ఖర్చు చేసేలా థియేటర్ మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇందులో భాగంగానే శ్రీరామలోచన్ ఆలోచనకు తగ్గట్టుగానే డిడి మొత్తం పవన్ కళ్యాణ్ కార్యాలయానికి చేర్చారు. గ్రామాభివృద్ధి కోసం వినూత్నంగా ఆలోచించిన శ్రీరామలోచనను స్థానికులతో పాటు, థియేటర్ యాజమాన్యం, జనసేన నేతలందరూ అభినందించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వరదలో చిక్కుకున్న బస్సు.. 22 మంది ప్రయాణికులు

తిరుమలలో భక్తులను పరుగులు పెట్టిస్తున్న పాములు

అర్ధరాత్రి వేళ ఆకాశంలో మిరుమిట్లు గొలిపిన కాంతులు.. కారణం ఇదే

లక్ష రూపాయలకే 5 బుల్లెట్‌ బైక్‌లు.. కొనుగోలు బిల్లు వైరల్‌

ఇది కదా స్మార్ట్‌ వర్క్‌ అంటే.. అతని టెక్నిక్‌కి అవాక్కవ్వాల్సిందే