RGV: చిరంజీవికి రామ్‌గోపాల్‌ వర్మ సారీ..!

Updated on: Nov 12, 2025 | 4:42 PM

మెగాస్టార్ చిరంజీవికి రామ్ గోపాల్ వర్మ క్షమాపణ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్. 'శివ' రీరిలీజ్ సందర్భంగా చిరు చేసిన ప్రశంసల వీడియోకు స్పందించిన వర్మ, తెలియకుండా బాధపెట్టి ఉంటే క్షమించమని ట్వీట్ చేశారు. గతంలో చిరంజీవితో సినిమా చేయాల్సిన వర్మ బాలీవుడ్‌కు వెళ్లడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ క్షమాపణ వెనుక అసలు ఫ్లాష్‌బ్యాక్, వర్మ-చిరు సంబంధాలపై చర్చ జరుగుతోంది.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు తెలిపారు. తెలుగు సినిమా గతిని మార్చిన ‘శివ’ చిత్రం రీరిలీజ్ సందర్భంగా చిరంజీవి ఆ సినిమాపై, తనపై ప్రశంసలు కురిపిస్తూ ఓ వీడియో విడుదల చేసారు. దానిపై స్పందించిన వర్మ … తెలియకుండా మిమ్మల్ని ఎప్పుడైనా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. చిరంజీవికి వర్మ సారీ చెప్పిన సందర్భం శివ ప్రమోషన్స్‌లో భాగమే కావచ్చు.. కానీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. శివ సినిమా, ఆ మూవీ రిలీజ్‌ టైమ్‌లో కనిపించిన ఇంపాక్ట్, సైకిల్‌ చెయిన్‌ సీన్‌.. రామ్‌గోపాల్‌ వర్మ టేకింగ్‌.. ప్రతి విషయాన్ని గురించి క్షుణ్ణంగా చిరు తన వీడియోలో ప్రస్తావించారు. నవంబర 14న శివ రీ రిలీజ్‌ అవుతున్న సందర్భంగా మెగాస్టార్‌ విషెస్‌ చెబుతూ విడుదల చేసిన వీడియో వైరల్‌ అవుతోంది. దీంతో ఈ వీడియోను షేర్‌ చేసి చిరుకి థాంక్స్ చెప్పేశారు ఆర్జీవీ. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ నేనెప్పుడైనా మిమ్మల్ని పొరపాటున ఇబ్బందిపెట్టి ఉంటే సారీ అన్నారు వర్మ. ఆ ఫ్లాష్‌బ్యాక్‌ ఏంటనేది ఇప్పుడు జనాల్లో క్యూరియాసిటీని పెంచింది. శివ సక్సెస్‌ తర్వాత మంచి ఫామ్‌లోకి వచ్చారు వర్మ. ఆ క్రమంలోనే చిరుతో ఓ సినిమా చేయాల్సింది. కానీ ఉన్నపళాన బాలీవుడ్‌ ఆఫర్లతో బిజీ అయిపోయారు ఆర్జీవీ. దీంతో చిరు ప్రాజెక్ట్ ఆగింది. అప్పుడు ఏం జరిగిందన్నది ఇప్పటిదాకా ఎవరికీ తెలియలేదు. కానీ, తాజాగా వర్మ పోస్టుతో ఆ న్యూస్‌ మళ్లీ వైరల్‌ అవుతోంది. వర్మతో ప్రాజెక్ట్ ఆగినా.. ఇప్పుడు శివను పొగడాల్సి వచ్చినప్పుడు చిరు ఓపెన్‌గా మెచ్చుకోవడం సూపర్‌ అంటున్నారు అభిమానులు. మన శంకరవరప్రసాద్‌గారు ఎక్కడి విషయాలను అక్కడే వదిలేస్తారంటూ హ్యాపీగా చెప్పుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పని ఒత్తిడి 10 మంది ప్రాణాలు తీసిన నర్స్

జబ్బులే రాని, మరణమే లేని బిడ్డ కావాలా? సాధ్యమా ??

ప్రాణం తీసిన వాటర్ హీటర్.. వేడినీళ్లు పెట్టుకుంటుండగా..

కళ్లు చెదిరేంత బంగారం దొరికినా కన్నెత్తి చూడలేదు..

తిరుమలలో అంబానీ కిచెన్‌.. నిత్యం 2 లక్షల మందికి సరిపడేలా వంటశాల