Prabhas: ఏ సినిమా అయినా ఆర్నెళ్లే.. టైమ్ లేదమ్మా అంటున్న ప్రభాస్

Updated on: Jan 29, 2026 | 9:40 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన సినిమాల నిర్మాణ వ్యూహాన్ని మార్చారు. ఇకపై ఏ సినిమా అయినా 6 నెలల్లోపే పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో కొన్ని చిత్రాలకు ఎక్కువ సమయం తీసుకున్న ప్రభాస్, ఇప్పుడు 'స్పిరిట్', 'ఫౌజీ', 'కల్కి 2' వంటి చిత్రాలను వేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ కొత్త విధానంతో రెండేళ్లలో ప్రతీ ఆర్నెళ్లకు ఒక సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు.

ఏ సినిమా అయినా ఆర్నెళ్లే.. అంతకుమించి టైమ్ లేదమ్మా మన దగ్గర.. ఓ ప్యాన్ ఇండియన్ స్టార్ హీరో చెప్తున్న మాట ఇది. నిజానికి ఇది చాలా అద్భుతమైన మాట.. ఒక్కో సినిమా కోసం ఊరికే మూడు నాలుగేళ్లు తీసుకోవడం కంటే 120 రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తే ఎలా ఉంటుంది..? ఇప్పుడిదే చేస్తున్నాడు ఓ హీరో. ఇంతకీ ఎవరాయన..? హిట్టు ఫ్లాపులతో పనిలేదు.. ప్రభాస్ కెరీర్ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. ఈయన సినిమాలు పూర్తి చేస్తున్న తీరు మిగిలిన హీరోలకెప్పుడూ క్వశ్చన్ మార్కే..! రాజా సాబ్ ఒక్కటే మూడేళ్ల పాటు.. మధ్య మధ్యలో వీలు చూసుకుని పూర్తి చేసిన ప్రభాస్.. ఇకపై చేయబోయే ఏ సినిమా అయినా 4 నెలలకు మించొద్దని ఫిక్సైపోయారు. స్పిరిట్ సినిమాను కేవలం 95 రోజుల్లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు సందీప్ వంగా. ఇప్పటికే చిత్ర షూటింగ్ మొదలైంది.. తర్వాత కూడా లాంగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు సందీప్. దానికితోడు 80 శాతం రీ రికార్డింగ్ ప్రీ ప్రొడక్షన్‌లోనే పూర్తి చేసారు ఈ దర్శకుడు.. దాంతో పోస్ట్ ప్రొడక్షన్ టైమ్ తక్కువగానే అవసరం పడుతుంది. ఫౌజీ కూడా షూటింగ్ మొదలై చాలా రోజులైనట్లు అనిపిస్తుంది కానీ.. ఇప్పటి వరకు 80 రోజులే షూట్ చేసారు.. మరో 60 రోజులే బ్యాలెన్స్ ఉంది. అంటే 140 రోజుల్లోనే పూర్తి కానుందన్నమాట. అలాగే కల్కి 2కి సైతం 130 రోజులే డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. పైగా ఇవన్నీ ఒకే టైమ్‌లో షూటింగ్ జరగనున్నాయి. ఎలా చూసుకున్నా.. రాబోయే రెండేళ్లలో ప్రతీ ఆర్నెళ్లకు ఓ సినిమా బరిలోకి దించనున్నారు రెబల్ స్టార్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు

టీడీపీ జెండాతో సెల్‌ టవర్‌ ఎక్కిన వ్యక్తి.. సత్యసాయి జిల్లాలో హైటెన్షన్

Bhagavanth Kesari Sequel: భగవంత్‌ కేసరికి సీక్వెల్‌.. అరిపించే న్యూస్ చెప్పిన అనిల్

99 రూపాయల సినిమా.. సూపర్ ప్లాన్ గురూ

Spirit: స్పిరిట్‌లో చిరంజీవి.. ఇదిగో మెగా క్లారిటీ