డైరెక్టర్‌పై పడి ఏడవడాన్నే చూస్తున్నారు.. అక్కడ జరిగింది వేరు !!

|

Aug 07, 2022 | 6:07 PM

సినిమా అంటే... మనకు ఎంటర్‌టైన్మెంటే కావచ్చు.. కాని ఈ సినిమాను డెలివరీ చేసిన వాళ్లకు మాత్రం అదో ఎమోషన్‌. అదో ఫీలింగ్. ఇంకా చెప్పాలంటే.. అదే వారి కమ్యూనికేషన్!!ఎస్ ఓ డైరెక్టర్ లేదా రైటర్ కథను రాయడమే కాదు..

సినిమా అంటే… మనకు ఎంటర్‌టైన్మెంటే కావచ్చు.. కాని ఈ సినిమాను డెలివరీ చేసిన వాళ్లకు మాత్రం అదో ఎమోషన్‌. అదో ఫీలింగ్. ఇంకా చెప్పాలంటే.. అదే వారి కమ్యూనికేషన్!!ఎస్ ఓ డైరెక్టర్ లేదా రైటర్ కథను రాయడమే కాదు.. ఆ కథలోనే జీవిస్తారు. ఆ కథలోనే ప్రపంచాన్ని చూస్తారు. అదే ప్రపంచాన్ని.. తను ఎంచుకున్న హీరో హీరోయిన్లకు కన్వే చేస్తారు. ,వారిని కూడా తన ప్రపంచంలో భాగస్వామ్యం చేస్తారు. అలా వారందరూ కలిసి డైరెక్టర్ ఊహలనుంచి పుట్టుకొచ్చిన ప్రపంచాన్ని ఎంతో కష్టపడి.. ఇష్టపడి… మనకు ప్రజెంట్ చేస్తారు. మనల్ని ఎంటర్ టైన్ చేస్తారు. అందుకే ఒక సినిమాలో నటించిన వారు.. ఆ సినిమాను ఊహించిన డైరెక్టర్ తో ఎమోషనల్ గా అటాచ్ అవుతారు. ఆయన క్రియేటివిటీని గౌరవిస్తారు. తెరపైన వారిని వారు చూసుకుని కన్నీళ్లు కూడా పెడతారు. ఆ నీటితోనే.. తమను అలా మలిచిన దర్శకులకు ధన్యవాదాలు చెబుతారు. తాజాగా సీతారామ సీత.. మృణాల్ ఠాకూర్ కూడా అదే పని చేశారు. సినిమా రిలీజ్‌ తరువాత ప్రీమియర్ ఫోకు వెళ్లిన ఈ హీరోయిన్ … సినిమా చూస్తూ ఎమోషన్ అయ్యారు. బయటికి వచ్చాక డైరెక్టర్ హను రాఘవపూడిని పట్టుకుని ఏడ్చేశారు. ఆ వీడియోతో మనల్ని కూడా కదిలిస్తున్నారు.

Published on: Aug 07, 2022 06:07 PM