Rashmika Mandanna: అతడే నా భర్త అని తేల్చి చెప్పేసిన రష్మిక !! వీడియో

|

Feb 18, 2022 | 8:06 PM

ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ హీరోయిన్లలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఒకరు. అటు బాలీవుడ్‏లోనూ రష్మిక ఫుల్‌ బిజీ షెడ్యూల్‌తో ఉన్నారు.

YouTube video player

ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ హీరోయిన్లలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఒకరు. అటు బాలీవుడ్‏లోనూ రష్మిక ఫుల్‌ బిజీ షెడ్యూల్‌తో ఉన్నారు. తాజాగా.. ఈ అందాల నటి తన పెళ్లి గురించి ఆక్తికర విషయాలు వెల్లడించారు. తాను లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తే ఇంట్లో ఒప్పించి చేసుకుంటానన్నారు. ఫిబ్రవరి 16న జరిగిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ప్రమోషన్స్‏లో ప్రేమ పై ఆసక్తికర కామెంట్స్ చేసారు. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పారు. ఎవరి దగ్గర అయితే సెక్యూర్‏గా ఫీల్ అవుతామో.. కంఫర్ట్‏గా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ స్నేహంగా ఉంటాం అనిపిస్తుందో అతడే జీవితంలో మంచి లైఫ్ పార్టనర్..అవుతారు.. అలాంటి వ్యక్తినే తను భర్తగా ఎంచుకుంటానని చెప్పుకొచ్చారు. తాను లవ్ మ్యారేజ్ చేసుకున్నా.. ఇంట్లో వారిని ఒప్పించే చేసుకుంటానని, ప్రస్తుతం తన ఫోకస్ పూర్తిగా కెరీర్ పైనే పెట్టినట్లు చెప్పుకొచ్చారు.

Also Watch:

Shanmukh Jashwanth: తప్పు ఒప్పుకున్న షణ్ను.. వీడియో

Published on: Feb 18, 2022 07:31 PM