Rashmika Mandanna: విజయ్‌తో పెళ్లిపై రష్మిక నాటీ ఆన్సర్

Updated on: Jan 23, 2026 | 6:38 PM

రష్మిక మండన్నా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండతో తన పెళ్లి వార్తలపై తెలివిగా స్పందించింది. నాలుగేళ్లుగా వస్తున్న ఈ రూమర్స్ గురించి తాను కూడా ఎదురుచూస్తున్నానని, సరైన సమయంలో దీనిపై మాట్లాడతానని చెప్పింది. తన పెళ్లిపై స్పష్టత ఇవ్వడానికి సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలియజేస్తానని, కెమెరా ముందు కాకుండా ఆఫ్ ది రికార్డ్‌లో చెబుతానని పేర్కొంది.

హీరోయిన్ రష్మిక ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయింది. గతేడాది ది గర్ల్‌ఫ్రెండ్‌తో హిట్‌ కొట్టిన ముద్దుగుమ్మ.. కొత్త ఏడాదిలోనూ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ.. తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించింది. విజయ్ దేవరకొండతో వచ్చే నెలలోనే పెళ్లంటూ వార్తలొస్తున్నాయి. దీనిపై క్లారిటీ ఇవ్వాలని యాంకర్ రష్మికను ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు రష్మిక చాలా తెలివిగా సమాధానం చెప్పుకొచ్చింది. నాలుగేళ్లుగా ఇలాంటి వింటూనే ఉన్నానని తెలిపింది. జనం కూడా ఎప్పటి నుంచో ఇదే ప్రశ్న అడుగుతున్నారు.. దాని కోసమే తాను కూడా ఎదురుచూస్తున్నానంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. దీనిపై ఎప్పుడు చెప్పాలో అప్పుడే మాట్లాడతానని తెలిపింది. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెప్తానంటూ మరోసారి క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాకుండా కెమెరా ముందు కాకుండా ఆఫ్ ది రికార్డ్‌లో ఈ విషయం గురించి మాట్లాడతానని రష్మిక సమాధానం దాటవేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్యాప్ ఇచ్చిన టాలీవుడ్ సిల్వర్‌ స్క్రీన్‌.. ఊపిరి పీల్చుకుంటున్న యంగ్ హీరోలు

Tamannaah Bhatia: స్పీడు పెంచిన మిల్కీ బ్యూటీ.. కేకపెట్టిస్తున్న కమ్ బ్యాక్

Ranveer Singh: ధురంధర్‌ తరువాత రణవీర్‌ ప్లాన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందా

రెండో సినిమాకే రిస్క్ చేస్తున్న స్టార్‌ కిడ్‌.. మాములుగా ఉండదు మరి

Malavika Mohanan: స్టైలింగ్ విషయంలో మాళవిక తరువాతే ఎవరైనా.. హాట్ లుక్స్ తో దుమ్ములేపుతుందిగా