నటి రన్యారావుకు రూ.102 కోట్ల జరిమానా

Updated on: Sep 04, 2025 | 6:07 PM

గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో అరెస్టై జైల్లో ఉన్న నటి రన్యా రావు కు భారీ షాక్ తగిలింది. ఈ కేసులో ఆమెకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏకంగా రూ.102 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఆమెతో పాటు మరో ముగ్గురికి కూడా రూ.50 కోట్లు జరిమానా విధిస్తూ డీఆర్ఐ అధికారులు మంగళవారం జైల్లో నోటీసులు అందజేశారు. మొత్తంగా ఈ కేసులో నిందితులకు రూ.270 కోట్ల జరిమానా విధించారు.

రన్యా రావు సహా నలుగురు నిందితులు ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్న నిందితులకు నోటీసులు ఇచ్చిన డీఆర్ఐ అధికారులు.. జరిమానా కట్టడంలో విఫలమైతే ఆస్తులను జప్తు చేస్తామని తెలిపారు. నటి రన్యా రావు కర్ణాటక సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ కే రామచంద్ర రావు కుమార్తెనంటూ ఆయన అధికారాన్ని వాడుకుంది. దీంతో కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె 2023 నుంచి 2025 మార్చి మధ్య దుబాయ్‌కు 52 సార్లు వెళ్లొచ్చినట్టు విచారణలో వెల్లడయ్యింది. తన సవతి తండ్రి అధికారాన్ని ఉపయోగించుకుంటూ ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలను తప్పించుకుంటూ బంగారం అక్రమంగా తరలించినట్టు తేలింది. ఆమె నివాసంలో జరిపిన తనిఖీల్లో రూ.2 కోట్ల విలువైన నగలు, రూ.2.67 కోట్ల క్యాష్‌ బయటపడింది. రన్యా రావు బంగారం అక్రమ రవాణాపై ఓ పక్క సీబీఐ, డీఆర్‌ఐలు.. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ల విచారణలు కొనసాగుతున్నాయి. పీఎంఎల్ఏ చట్టం కింద ఈడీ ఈ ఘటనపై కేసు నమోదు చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బ్యాంక్ జాబ్ కు రిజైన్.. యువతి పోస్ట్‌ వైరల్‌

దుబాయ్‌లో ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉన్న సామ్‌.. త్వరలోనే పెళ్లి

వినాయకుడికి నైవేద్యంగా బంగారు ఉండ్రాళ్లు! కేజీ ఎంతో తెలుసా?