Boyapati Sreenu: బోయపాటి ప్యాన్ ఇండియా ఫిల్మ్.. మరి రణ్‌వీర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారా ??

Updated on: Jan 31, 2026 | 12:39 PM

దర్శకుడు బోయపాటి శ్రీను తన తదుపరి ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌కు ఇటీవల కథ చెప్పినట్లు తెలుస్తోంది. అఖండ సీక్వెల్ ఆశించినంత విజయం సాధించకపోయినా, బోయపాటి మాస్ కథలతో పాన్ ఇండియా మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. రణవీర్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు.

దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్థాయి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. కమర్షియల్ సినిమాలకు పేరుగాంచిన బోయపాటి, బలమైన మాస్ కథలతో విజయాలు సాధించగలనని విశ్వసిస్తున్నారు. గతంలో అఖండ చిత్రంతో ప్యాన్ ఇండియా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించినా, దాని సీక్వెల్ విడుదల తర్వాత ఆశించిన స్పందన రాలేదు. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న బోయపాటి, ఇప్పుడు మరింత పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. తన తదుపరి ప్రాజెక్టు కోసం నార్త్ హీరో అవసరమని భావించిన బోయపాటి, ఇటీవల బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌ను కలిసి కథ చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం రణవీర్ సింగ్ మాస్ చిత్రాలపై ఆసక్తి చూపుతున్నారు. అయితే, గతంలో ప్రశాంత్ వర్మతో చేయాల్సిన సినిమాను పక్కన పెట్టిన రణవీర్, ఇప్పుడు బోయపాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, భవిష్యత్తులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి గ్లోబల్ స్థాయిలో ఒక సినిమా చేయాలనేది బోయపాటి కల. సరైనోడు సమయం నుంచీ బోయపాటి-అల్లు అర్జున్ కాంబినేషన్ గురించి వార్తలు వస్తున్నా, సరైన సమయం కోసం ఇద్దరూ వేచి చూస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్‌ పెంచిన సంక్రాంతి స్టార్స్

పసి పిల్లలు, బాలింతల కోసం జంపన్న వాగు వద్ద ఉడుకు నీళ్లు

ఇక జంక్‌ ఫుడ్‌ యాడ్స్‌పై బ్యాన్.. ఆరోగ్య సమస్యలకు చెక్

అమ్మమ్మకు మెసేజ్‌ పంపిన కో పైలట్‌ శాంభవి.. చివరికి..

Medaram Jathara: తెలంగాణ కుంభమేళా.. మేడారం జాతర విశిష్టత ఏంటంటే..