Ranabali: రణబాలి రౌద్రం.. విజయ్ విశ్వరూపం

Edited By:

Updated on: Jan 28, 2026 | 12:32 PM

"రణబాలి" గ్లింప్స్‌తో విజయ్ దేవరకొండ కొత్త అవతారం ఆకట్టుకుంటుంది. రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో 1854-1878 మధ్య కాలంలో రాయలసీమ నేపథ్యంలో సాగే పీరియడ్ డ్రామా ఇది. బ్రిటీషర్ల క్రూరత్వాన్ని చూపించనున్న ఈ సినిమాలో విజయ్ యోధుడిగా, రష్మిక జయమ్మగా కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, టి-సిరీస్ నిర్మిస్తున్న ఈ VD14 చిత్రం 2026లో విడుదల కానుంది.

విజయ్ దేవరకొండ కొత్త సినిమా టీజర్ ఎలా ఉంది..? రౌడీ జనార్ధనతో ఆల్రెడీ మాస్‌లో విశ్వరూపం చూపిస్తున్న విజయ్.. ఈసారి ఎలాంటి పాత్రతో వస్తున్నారు..? పీరియడ్ సినిమాలో రౌడీ లుక్ ఎలా ఉంది..? అసలు VD14తో ఫ్యాన్స్‌కు ఎలాంటి ట్రీట్ ఇవ్వడానికి విజయ్ రెడీ అవుతున్నారు..? రణబాలి గ్లింప్స్‌పై ఓ లుక్ వేద్దామా..? విజయ్ దేవరకొండ మోస్ట్ ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ రణబాలి టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది. రాహుల్ సంక్రీత్యన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో యోధుడిగా నటిస్తున్నారు విజయ్. ఈ పాత్ర కోసం ఆయనెంతగా మేకోవర్ అయ్యారో గ్లింప్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది. 1854-1878 మధ్య జరిగే కథ ఇది.. శ్యామ్ సింగరాయ్ తర్వాత రాహుల్ తెరకెక్కిస్తున్న మరో పీరియడ్ సినిమా ఇది. ఇది ఇండిపెండెన్స్ కథ కాదు.. దానికి ముందు జరిగిన మారణకాండ అంటూ టీజర్‌లోనే చెప్పారు మేకర్స్. ముఖ్యంగా 40 ఏళ్లలో కోటి మందిని చంపిన బ్రిటీషర్స్ క్రూరత్వాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నారు రాహుల్. 18వ శతాబ్ధంలో రాయలసీమ ప్రాంతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ రణబాలి వస్తుంది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు.. ఆమె జయమ్మ పాత్రలో కనిపిస్తున్నారు. హాలీవుడ్ నటుడు ఆర్నాల్ వోస్లూ ఇందులో విలన్‌గా నటిస్తున్నారు. మైత్రి మూవ మేకర్స్, టి సిరీస్ సంయుక్తంగా రణబాలిని నిర్మిస్తున్నారు. 2026లోనే ఈ సినిమా విడుదల కానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

99 రూపాయల సినిమా.. సూపర్ ప్లాన్ గురూ

Lokesh Kanagaraj: లోకేష్ ప్రెస్ మీట్.. LCU సీక్రెట్స్ రివీల్

Andhra Pradesh: విశాఖ తీరంలో తండేల్ మూవీ సీన్ మరోసారి రిపీట్

AP Politics: రాజకీయ వేడిని పెంచిన వైసీపీ Vs టీడీపీ కామెంట్స్

Madaram: నేటి నుంచే మేడారం మహా జాతర.. సారలమ్మ గద్దెపైకి వచ్చే వేళ