రెండోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్.. ఉపాసన సీమంతం వేడుక

Updated on: Oct 24, 2025 | 6:33 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తండ్రి కాబోతున్నారు. మెగాస్టార్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ తో పాటు ఉపాసన సీమంతం వేడుకను నిర్వహించారు. ఈ వీడియోను ఉపాసన షేర్ చేస్తూ డబుల్ ప్రేమ, డబుల్ బ్లెస్సింగ్స్, డబుల్ సెలబ్రేషన్స్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ జంటకు 2023 జూన్ లో క్లీంకార జన్మించగా రెండేళ్ల తర్వాత మరోసారి పేరెంట్స్ కాబోతున్నారు.

‘సింబా’ వస్తున్నాడంటూ మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కొన్ని రోజులుగా రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో ఒక్క వీడియోతో రూమర్స్ కు బ్రేక్ చేశారు ఉపాసన. తాజాగా షేర్ చేసిన వీడియోలో కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ ఉపాసనను ఆశీర్వదిస్తూ కనిపించారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఉపాసన, రెండో సంతానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదటి బిడ్డ విషయంలో చాలా ఆలస్యం చేశామని.. ఆ సమయంలో వచ్చిన విమర్శలను, ఒత్తిడిని నేను పట్టించుకోలేదన్నారు.రెండోసారి బిడ్డకు జన్మనివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నట్లు ఉపాసన స్పష్టం చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ విడుదలైన గ్లింప్స్ మూవీపై హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో చరణ్ పక్కా ఊర మాస్ లుక్ లో కనిపించనున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న పెద్ది సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చంద్రుడిపై నిర్మాణాలు అసాధ్యమా ?? కీలక సమాచారం పంపిన చంద్రయాన్‌-2

Diwali Sales 2025: దీపావళి సేల్స్‌ ఎన్ని లక్షల కోట్లు దాటాయంటే.. జనం ఎక్కువగా మోజు పడ్డవి ఇవే

పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. ఏమైందంటే

China: గంటకు 453 కి.మీ హై స్పీడ్‌ రైలును ఆవిష్కరించిన చైనా

Golden Dress: మెరిసిపోతున్న గోల్డెన్‌ డ్రెస్‌ చూసారా