సలార్ సినిమాను వదులకుని చరణ్ తప్పు చేశాడా ??
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్! చిరు వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. స్టార్ కిడ్ నుంచి... ఇప్పుడు సెల్ఫ్ మేడ్ పాన్ ఇండియా స్టార్‌గా ట్యాగ్ తెచ్చుకున్నాడు. తన యాక్టింగ్‌తో.. తన స్క్రీన్ ప్రజెన్స్‌తో.. తన యాటిట్యూడ్‌తో.. ఇంటర్నేషనల్ వైడ్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. ఆలోవర్ వరల్డ్ ఉన్న తన ఫ్యాన్స్ నుంచి చరణ్ ఎప్పుడూ అప్రిషియేన్స్ అందుకుంటూనే ఉంటాడు.
అయితే రీసెంట్‌గా మాత్రం చరణ్ తీసుకున్నాడని చెబుతున్న ఓ నిర్ణయం కారణంగా ఇప్పుడు తన ఫ్యాన్స్‌లో బాధకు కారణం అవుతున్నాడు. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే… సలార్ సినిమాను చరణ్ రిజెక్ట్ చేశాడట. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రామ్ చరణ్ ను ప్రత్యేకంగా కలిశాడు. ఒక సినిమా కూడా చేయాలనుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక సినిమా పట్టాలెక్కుతుందన్న తరుణంలో ఏమైందో తెలియదు కానీ అనూహ్యంగా ఈ మూవీ హోల్డ్ లో పడిపోయిందట. కట్ చేస్తే.. కొన్ని రోజుల తర్వాత ఇదే కథను ప్రభాస్ కు వినిపించాడు ప్రశాంత్ నీల్. వెంటనే డార్లింగ్ ఒకే చెప్పడంతో సినిమా పట్టాలెక్కింది. ఆ తర్వాత బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ సినిమా ఏదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుగా.. సలార్. ఈ హై యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్రభాస్ ను ఓ పవర్ ఫుల్ రోల్ లో చూపించాడు ప్రశాంత్ నీల్. సినిమా కూడా రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈ న్యూస్ కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో… చరణ్ ఫ్యాన్స్ కాస్త ఫీలవుతున్నట్టు ఉన్నారు,. సలార్ సినిమాను వదులకుని చరణ్ తప్పు చేశాడంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకాశంలో అద్భుత దృశ్యం.. పులకించిపోయిన భక్తులు
ఆన్‌లైన్‌లో రూ.4 కోట్ల వాచ్ ఆర్డర్ చేశాడు.. డెలివరీ వచ్చింది చూసి
జాతి వైరం మరచి.. పసికూనల ఆకలి తీర్చి
చూసి తీరాల్సిన రిచ్ కంట్రీ ఏడుగురే ఖైదీలు.. వంద మంది పోలీసులు
