Prabhas: ప్రభాస్ సీక్రెట్‌గా దాచుకున్న పెళ్లి మ్యాటర్

|

Jan 13, 2025 | 1:47 PM

ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. డార్లింగ్ పెళ్లి వార్త కోసం అభిమానులు, సినీ తారలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు.. ? ఎవరిని వివాహమాడతారు ? అనే సందేహాలు ఎంతోమందిలో ఉన్నాయి. బాహుబలి సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటాను అని గతంలోనే చెప్పిన ప్రభాస్.. ఇప్పటివరకు మళ్లీ ఆ మాట ఎత్తడం లేదు.

ఇక డార్లింగ్ పెళ్లి గురించి.. ఆయనకు కాబోయే భార్య ఈ అమ్మాయే అంటూ సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ క్రియేట్ అయ్యాయి. కొన్నిసార్లు ఆ హీరోయిన్ తో ప్రభాస్ ప్రేమ, పెళ్లి అంటూ ప్రచారం నడిచింది. ఆ తర్వాత బంధువుల అమ్మాయినే వివాహం చేసుకుంటాడని రూమర్ వినిపించింది. అయితే ఇప్పటివరకు ఈ విషయాలపై డార్లింగ్ నేరుగా స్పందించలేదు. ఈక్రమంలోనే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన స్నేహితుడు ప్రభాస్ పెళ్లి గురించి హింట్ ఇచ్చాడు. ఆయన ఎవరిని పెళ్లాడనున్నారనే విషయాన్ని ఇటీవల పాల్గొన్న అన్ స్టాపబుల్ టాక్ షోలో బయటపెట్టారు. ఈ షోలో ప్రభాస్ పెళ్లి గురించి బాలకృష్ణ ప్రశ్నించగా.. రామ్ చరణ్ నవ్వులు పూయించారు. ఆంధ్రప్రదేశ్ లోని గణపవరానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోనున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది. దీంతో ప్రభాస్ పెళ్లి గురించి రామ్ చరణ్ హింట్ ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు ఆ అమ్మాయి ఎవరా ? అంటూ నెట్టింట ఆరా తీస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫ్యాన్స్ అసహనం.. దీంతో మేకర్స్ తీసుకున్నారు బంపర్ డెసిషన్

TOP 9 ET News: డాకు మహారాజ్ బంపర్ హిట్.. డే1 దిమ్మతిరిగే కలెక్షన్స్

కిటికీ నుంచి వింత శబ్ధాలు.. వెళ్లి చూసిన యజమానికి షాక్‌