విదేశీ గడ్డపై రామ్ చరణ్ కు విశిష్ట గౌరవం

|

Aug 20, 2024 | 10:35 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ వేదికగా రామ్ చరణ్ కు 'ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్' పురస్కారం అందజేశారు. అనంతరం ప్రఖ్యాత ఫెడ్ స్క్వేర్ వద్ద జరిగిన భారత జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలోనూ రామ్ చరణ్ పాల్గొన్నారు. త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించిన ఆయన

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ వేదికగా రామ్ చరణ్ కు ‘ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్’ పురస్కారం అందజేశారు. అనంతరం ప్రఖ్యాత ఫెడ్ స్క్వేర్ వద్ద జరిగిన భారత జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలోనూ రామ్ చరణ్ పాల్గొన్నారు. త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించిన ఆయన 2009లో ‘ఆరెంజ్’ చిత్రం షూటింగ్ కోసం ఆస్ట్రేలియా వచ్చానని, ఆ సమయంలో తన పట్ల ఇక్కడి ప్రజలు చూపించిన ఆదరణను మర్చిపోలేనని తెలిపారు. గతంలో కంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మంది భారతీయులు కనిపిస్తున్నారని, దాంతో భారత్ లోనే ఉన్నట్టు అనిపిస్తోందని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాను కూడా భారతీయులు తమ సొంతగడ్డలాగానే భావిస్తారని, ఇక్కడ భద్రంగా ఉంటున్నారని పేర్కొన్నారు. థాంక్యూ మెల్బోర్న్… థాంక్యూ ఆస్ట్రేలియా… థాంక్యూ ఇండియా అంటూ వ్యాఖ్యానించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

iSmart News: ఇంగ్లీష్ లో ఇరగదీస్తున్న ఏడేళ్ల బుడ్డోడు

ఉద్యోగం నుంచి తీసేశారని.. సీఈవో పాస్‌‌పోర్ట్ కొట్టేశాడట

TOP 9 ET News: ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడి కామెంట్స్..

Follow us on