Pekamedalu Review: హిట్టా.? ఫట్టా.? పక్కా మిడిల్ క్లాస్ స్లమ్ కుర్రాడు హిట్ అందుకున్నాడా.?
తెలుగు, తమిళంలో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించిన నటుడు వినోద్ కిషన్. ఈయన ఇప్పుడు హీరోగా పేకమేడలు అనే సినిమా చేసాడు. పక్కా మిడిల్ క్లాస్ స్లమ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు నీలగిరి మామిళ్ళ. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది..? సినిమాలో ఆకట్టుకునేదేంటి.. బోర్ కొట్టించేదేంటి.. పూర్తి రివ్యూలో చూద్దాం..

లక్ష్మణ్ అలియాస్ వినోద్ కిషన్ ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పని చేస్తుంటాడు. వచ్చే పది పరకతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. అతడికి భార్య వరలక్ష్మి అలియాస్ అనూష కృష్ణ, కొడుకు టింకూ ఉంటారు. డబ్బులు లేకపోయినా కూడా బాగా రిచ్ లైఫ్ ఎంజాయ్ చేయాలని కలలు కంటుంటాడు లక్ష్మణ్. దానికోసం భార్యను కూడా ఇబ్బంది పెడుతుంటాడు. బి టెక్ చదివావు కాబట్టి ఒక జాబ్ చేయమని.. నెలకు జీతం వచ్చే జాబ్ అయితే బాగుంటుందని.. పిల్లాడి భవిష్యత్తు గురించి ఆలోచించమని చాలా సార్లు చెప్తుంది వరాలు. కానీ లక్ష్మణ్ అవేం బుర్రకెక్కించుకోడు. ఇదే సమయంలో బాగా డబ్బున్న ఎన్నారై శ్వేత అలియాస్ రితిక శ్రీనివాస్ హైదరాబాద్‌కు వస్తుంది. ఆమెతో లక్ష్మణ్‌కు ఓ ఫ్లాట్ విషయంలో పరిచయం ఏర్పడుతుంది. అక్కడ్నుంచి శ్వేతను ట్రాప్ చేస్తాడు లక్ష్మణ్. తన బిజినెస్ కోసం ఆమెను వాడుకుంటాడు. ఈ విషయం భార్య వరాలుకు తెలిసి.. భర్త ఇంక మారడని పుట్టింటికి వెళ్లిపోతుంది. అక్కడ పెద్దలతో పంచాయితీ చేస్తారు. అయినా కూడా లక్ష్మణ్‌లో ఏ మార్పు రాదు. కొన్నాళ్ల తర్వాత ఇంటికి తిరిగొచ్చేస్తుంది వరాలు. తనకు వచ్చిన వంటతో ఓ చిన్న కర్రీ పాయింట్ పెట్టుకుంటుంది. ఆ తర్వాత లక్ష్మణ్‌లో మరో కోణం బయటికి వస్తుంది.. అప్పుడేమైంది..? అసలు లక్ష్మణ్ మారాడా లేదా అనేది అసలు కథ..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.