Rajinikanth: సినిమాలకు రజనీకాంత్‌ గుడ్‌బై చెప్పేస్తారా ??

Updated on: Nov 02, 2025 | 9:10 PM

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ సినీ కెరీర్ ముగింపుపై కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జైలర్ సీక్వెల్, నెల్సన్ దర్శకత్వంలో కమల్ హాసన్‌తో మల్టీస్టారర్ తర్వాత ఆయన నటనకు గుడ్‌బై చెబుతారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఇలాంటి ఊహాగానాలు వచ్చినా, తలైవర్ వరుస చిత్రాలు చేశారు. ప్రస్తుత వార్తలు నిజమా కాదా అనేది కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తారా అనే చర్చ కోలీవుడ్‌లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. రజనీకాంత్ ఇంకెన్నాళ్లు మేకప్ వేసుకుంటారు? ఆన్ లొకేషన్స్‌కు ఇంకెన్ని రోజులు వస్తారు? తన తదుపరి చిత్రాల తర్వాత ఆయన ఏం చేస్తారు? “చాల్లే ఇక” అనే స్టేట్‌మెంట్‌ను ఏమైనా ప్రిపేర్ చేస్తున్నారా అనే ప్రశ్నలు తలైవర్ అభిమానుల మధ్య తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
అతి త్వరలో తలైవర్ షూటింగ్‌లకు ఫుల్ స్టాప్ పెడతారన్న వార్తలు కోలీవుడ్‌లో షాకింగ్‌గా మారాయి. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ సీక్వెల్‌తో బిజీగా ఉన్నారు. తొలి భాగం విజయవంతమైన తర్వాత ప్రేక్షకుల డిమాండ్ మేరకు ఈ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. జైలర్ సీక్వెల్ పూర్తయిన తర్వాత, నెల్సన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prashanth Varma: ప్రశాంత్‌ వర్మ Vs నిర్మాతలు.. నిజమేనా ??

నిన్న వరద, నేడు బురద.. ఎటు చూసినా హృదయ విదారకమే

రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నవంబర్‌ 4 నాటికి మరో అల్పపీడనం.. మళ్లీ భారీ వర్షాలు తప్పవా ??

వినియోగదారులకు అలర్ట్‌.. నవంబర్ 1 నుంచి మారిన నిబంధనలు ఇవే!