రజినీకాంత్, కమల్ మల్టీస్టారర్ పై క్లారిటీ వీడియో

Updated on: Oct 26, 2025 | 4:40 PM

రజినీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కమల్ హాసన్ అధికారికంగా ప్రకటించినప్పటికీ, రెగ్యులర్ షూట్, దర్శకుడి వివరాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే, రజినీకాంత్ కూతురు సౌందర్య త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందని వెల్లడించారు. 46 ఏళ్ల తర్వాత ఈ లెజెండ్స్ కలిసి నటించనున్నారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సౌత్ ఇండియన్ సినిమా లెజెండ్స్ రజినీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. కెరీర్ ప్రారంభంలో కే. బాలచందర్ శిష్యులుగా పలు చిత్రాలలో కలిసి నటించిన ఈ అగ్రతారలు, 1979లో వచ్చిన అల్లావుద్దీన్ అద్భుత దీపం తర్వాత పూర్తిస్థాయి పాత్రలలో కనిపించలేదు. 80వ దశకంలో ఇద్దరూ సూపర్ స్టార్‌లుగా ఎదగడంతో, వారిద్దరితో మల్టీస్టారర్ చేసే సాహసం ఏ దర్శకుడూ చేయలేకపోయాడు. 2020లో లోకేష్ కనకరాజ్ ఆధ్వర్యంలో ఒక ప్రాజెక్ట్ ప్రణాళిక చేసినప్పటికీ, కరోనా మహమ్మారి కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. అయితే, ఇటీవల కమల్ హాసన్ స్వయంగా రజినీకాంత్‌తో మల్టీస్టారర్‌ను అధికారికంగా ప్రకటించారు.

మరిన్ని వీడియోల కోసం :

కర్నూలు బస్సు ప్రమాదం.. బస్సులో నో ఫైర్‌ సేఫ్టీ వీడియో

ఒక్కగానొక్క కొడుకు.. ఇక నేను ఎలా బతకాలి? వీడియో

ల్యాప్‌టాప్స్‌ చార్జింగ్‌ పెట్టడంతో వీడియో