రజనీ – కమల్‌ కాంబో… మరో హింట్ ఇచ్చిన ఇద్దరి కూతుళ్లు

Updated on: Oct 27, 2025 | 8:32 PM

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్‌ల మల్టీస్టారర్‌ కోసం అభిమానులు 45 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. కూలి సినిమా తర్వాత ఈ కాంబినేషన్‌లో ఒక చిత్రం రాబోతోందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ, రజినీ కూతురు సౌందర్య, కమల్ కూతురు శృతి హాసన్‌లు సినిమాపై హింట్స్ ఇచ్చారు. కమల్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తారని సౌందర్య వెల్లడించారు.

కోలీవుడ్ అభిమానులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్‌ల మల్టీస్టారర్ త్వరలోనే తెరపైకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు వరుసగా కలిసి నటించిన ఈ ఇద్దరు దిగ్గజాలు గత 45 ఏళ్లుగా ఒక్కసారి కూడా ఒకే తెరను పంచుకోలేదు. దీంతో, ఈ ఇద్దరినీ మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. కూలి సినిమా వైఫల్యం తర్వాత రజినీకాంత్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌పై రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే కమల్-రజినీ కాంబోలో సినిమా ఉంటుందన్న వార్త వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాలీవుడ్‌లో హారర్‌ మూవీ, రామ్ గోపాల్ వర్మ బౌన్స్ బ్యాక్ అవుతారా

గుడ్‌ న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే ??

ఎస్‌బీఐలో ఉద్యోగాల జాతర.. 3,500 పీవో పోస్టుల భర్తీకి ఏర్పాట్లు

తరుముకొస్తున్న మొంథా తుఫాన్‌.. కాకినాడ వద్ద తీరం దాటే ఛాన్స్

నాగపంచమి వేళ ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం