మాటలతోనే ట్రోలర్స్‌ను చావుదెబ్బ కొట్టిన ఆది

Updated on: Nov 20, 2025 | 12:32 PM

రాజమౌళి వారణాసి ఈవెంట్ కోసం ఎంతో శ్రమించినా, ఎదురైన అవాంతరాలతో ఫ్రస్ట్రేషన్‌కి గురయ్యారు. ఈ క్రమంలో దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కొందరు ఫిర్యాదులు చేయగా, ఇప్పటివరకు ఆయన స్పందించలేదు. అయితే, హైపర్ ఆది ఈ వివాదంపై స్పందిస్తూ, ట్రోలర్స్‌ను తనదైన శైలిలో విమర్శిస్తూ వైరల్ అయ్యారు.

వారణాసి సినిమా ఈవెంట్ కోసం రాజమౌళి ఎంతో శ్రమించారు. ఈవెంట్ ను సక్సెస్ చేయడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ఆయన అనుకున్నట్లే ఈవెంట్ అంతా బాగా జరిగినప్పటకీ మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో జక్కన్న కాస్త ఫ్రస్టేషన్ అయ్యారు. ఇదే క్రమంలో దేవుళ్లపై తనకు నమ్మకం లేదంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే కొందరు రాజమౌళిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. వారణాసి గ్లింప్స్ వీడియో లో అయితే ఏకంగా దేవుడనే తప్పు పడతావా? అంటూ కొందరు రాజమౌళిపై తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు రాజమౌళి గాని వారణాసి ఈవెంట్ టీం గానీ అధికారికంగా స్పందించలేదు. అయితే జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది మాత్రం వారణాసి ఈవెంట్ వివాదంపై స్పందించాడు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవ్వడమే కాదు.. ట్రోలర్స్‌ను చావుదెబ్బ కొట్టాడనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు ఆది. ప్రియదర్శి హీరోగా వస్తున్న ప్రేమంటే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హైపర్ ఆది హాజరయ్యారు. ఈక్రమంలోనే ట్రోలర్స్‌ పై విరుచుకుపడ్డాడు ఆది. ఇష్టం వచ్చినట్టు డైరెక్టర్లు, హీరోలపై ట్రోల్స్ చేయడం చాలా దారుణమని తన స్టైల్లో పంచులతో చెప్పుకొచ్చాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘అయ్యా.. నా కొడుకును ఇబ్బంది పెట్టొద్దు!’ రవి తండ్రి రిక్వెస్ట్

బాలయ్యను క్షమాపణలు కోరిన సీవీ ఆనంద్

SS Rajamouli: అటు పోలీస్ కేసు.. ఇటు టైటిల్ వివాదం! దెబ్బ మీద దెబ్బ!

Pawan Kalyan: శభాష్ సజ్జనార్..! పవన్‌ అభినందనలు

శబరిమలకు పోటెత్తిన భక్తులు.. స్వామి దర్శనానికి 18 గంటలు