The Raja Saab: ప్రభాస్ రేంజ్ అలా ఉంటుంది మరి.. రాజా సాబ్ బిజినెస్ అదుర్స్
రాజా సాబ్ విడుదల 20 రోజుల్లో ఉండగా, ప్రభాస్ క్రేజ్‌తో ఈ సినిమా భారీ అంచనాలు సృష్టిస్తోంది. నిర్మాత విశ్వప్రసాద్ చెప్పిన దాని ప్రకారం బడ్జెట్ 400 కోట్లు కాగా, థియేట్రికల్, నాన్-థియేట్రికల్ కలుపుకొని మొత్తం 600 కోట్ల బిజినెస్ టార్గెట్‌తో ముందుకు వెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 160 కోట్లు, వరల్డ్ వైడ్ 350 కోట్లకు పైగా బిజినెస్ జరగనుంది. ప్రమోషన్స్, ప్లానింగ్స్‌పై మేకర్స్ పూర్తి ఫోకస్ పెట్టారు.
రాజా సాబ్ విడుదలకు మరో 20 రోజులే ఉంది.. మరి ఈ గ్యాప్‌లో మేకర్స్ ఏం చేయబోతున్నారు..? ప్రమోషనల్ ప్లానింగ్స్ ఎలా ఉండబోతున్నాయి..? అసలు బిజినెస్ డీటైల్స్ ఏంటి..? ఏపీ, తెలంగాణలో సినిమాను ఎంతకు అమ్ముతున్నారు..? వరల్డ్ వైడ్ బిజినెస్ ఎంత..? ప్రభాస్ గత సినిమాల స్థాయిలోనే బిజినెస్ జరుగుతుందా..? చూద్దాం ఎక్స్‌క్లూజివ్‌గా.. ప్రభాస్ గత సినిమాలతో పోలిస్తే రాజా సాబ్‌పై ముందు నుంచి కాస్త తక్కువ అంచనాలైతే ఉన్నాయి. అది బడ్జెట్ పరంగా కావచ్చు.. టెక్నికల్ టీం కావచ్చు.. దర్శకుడు కావచ్చు.. కారణమేదైనా సలార్, కల్కి రేంజ్‌లో రాజాసాబ్ ట్రెండ్ అవ్వలేదనేది కాదనలేని వాస్తవం. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ.. రాజా సాబ్ కూడా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నారు. ఇది చిన్న సినిమా కాదు.. దీని బడ్జెట్ కూడా పెద్దదే అంటూ ముందు నుంచి చెప్తూనే ఉన్నారు నిర్మాత విశ్వప్రసాద్. ఆయన చెప్తున్న దాని ప్రకారం రాజా సాబ్ బడ్జెట్ 400 కోట్లకు పైనే..! దానికి తగ్గట్లుగానే నాన్ థియెట్రికల్‌లో రికార్డులు తిరగరాస్తుంది రాజా సాబ్.. అదే విధంగా థియెట్రికల్‌లోనూ దుమ్ము దులిపేస్తుంది ఈ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లోనే రాజా సాబ్ బిజినెస్ 160 కోట్ల వరకు ఉంది. నైజాం 70 కోట్లు, ఏపీ 75 కోట్లు, సీడెడ్ 25 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుందని అంచనా. అలాగే ఓవర్సీస్, హిందీ కలిపి మరో 150 కోట్లు ఈజీగా ఉంటుంది. అంటే వరల్డ్ వైడ్ 350 కోట్లకు పైగానే టార్గెట్‌తో బరిలోకి దిగబోతున్నారు రాజా సాబ్. బాహుబలి 2, సలార్, కల్కి స్థాయిలోనే దీని బిజినెస్ కూడా జరుగుతుంది. దర్శకుడితో పని లేకుండా తన క్రేజ్‌తోనే బిజినెస్ చేస్తున్నారు ప్రభాస్. పైగా పండగ సీజన్ కావడం.. చాలా ఏళ్ళ తర్వాత వింటేజ్ లుక్‌లో ప్రభాస్ దర్శనం.. కామెడీ ఇవన్నీ రాజా సాబ్‌కు కలిసొచ్చే విషయాలు. 3 గంటలకు పైగా నిడివితో రాబోతుంది ఈ చిత్రం. మొత్తానికి థియెట్రికల్, నాన్ థియెట్రికల్ కలిపి 600 కోట్లకు పైగానే బిజినెస్ చేస్తుంది రాజా సాబ్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ravi Teja: కరెక్ట్ ట్రాక్ లోకి వచ్చిన రవితేజ.. వరుస ఫ్లాపుల తర్వాత ఇప్పుడు బోధపడిందా
ఒక్క పాటతో మారిపోతున్న సినిమాల జాతకాలు..
Demon Pavan: అప్పుడు ఇజ్జత్ పోగొట్టుకున్నాడు.. ఇప్పుడు హీరోలా నిలబడ్డాడు
Bharani: గెలవకున్నా పర్లేదు.. ఆ రేంజ్‌లో రెమ్యునరేషన్ దక్కించున్న భరణి