రాజ్‌ తరుణ్‌ కొత్త సినిమాకి OTTలో అరుదైన రికార్డ్

Updated on: Nov 12, 2025 | 3:09 PM

రాజ్ తరుణ్ 'చిరంజీవ' సినిమాతో ఆహా ఓటీటీలో అరుదైన రికార్డు సృష్టించారు. నవంబర్ 7న విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు దాటింది. ఒకప్పుడు వరుస హిట్స్‌తో లవర్ బాయ్‌గా గుర్తింపు పొందిన రాజ్ తరుణ్, ప్లాప్‌లు, వివాదాల తర్వాత ఈ ఓటీటీ విజయంతో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఇది ఆయన కెరీర్‌లో ఒక మైలురాయి.

ఒకప్పుడు తెలుగులో లవర్ బాయ్‌గా ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోలలో రాజ్ తరుణ్ ఒకరు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా యూట్యూబ్ లో పాపులర్ అయిన ఈ హీరో.. ఆ తర్వాత హీరోగా అరంగేట్రం చేశారు. కెరీర్ మొదట్లో వరుసగా హిట్స్ అందుకుంటూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న రాజ్ తరుణ్.. ఆ తర్వాత సినిమాలు తగ్గించేశారు. చేసిన ఆ కొన్ని సినిమాలు కూడా ప్లాప్ అవడంతో.. రాజ్‌ తరుణ్ ఆల్మోస్ట్ ఫేడవుట్ అయిపోయాడు. దాంతో పాటే తన పర్సనల్ లైఫ్‌ కారణంగా.. వివాదాలకు కేరాఫ్‌గా మారాడు. మీడియాలోనూ.. సోషల్ మీడిమాలోనూ తెగ వైరల్ అయ్యాడు. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్న ఈహీరో.. ఇప్పుడు ‘చిరంజీవ’ సినిమాతో ఆహా ఓటీటీలోకి వచ్చాడు. రావడమే కాదు.. ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటూనే అరుదైన రికార్డ్‌కు కేరాఫ్‌గా మారాడు. జబర్ధస్థ్ కమెడియన్ అభినయ కృష్ణ దర్శకత్వంలో రాజ్‌ తరుణ్‌ హీరోగా తెరకెక్కిన చిరంజీవ సినిమా.. నవంబర్ 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మంచి క్యూరియాసిటీ మధ్య అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓటీటీలో రిలీజ్ అయిన మూడు రోజులలోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటి అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో రాజ్ తరుణ్ సరసన కుషిత కల్లపు కథానాయికగా నటించింది. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ తో హైప్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఓటీటీ ఫీల్డ్‌లో మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dude: ఎట్టకేలకు డ్యూడ్ సినిమా OTTలోకి.. డేట్స్ ఫిక్స్

Sharwanand: ఎట్టకేలకు విడాకుల వార్తలకు చెక్ పెట్టిన శర్వా

Abhishek Bachchan: నా హృదయం ముక్కలైంది.. అభిషేక్ బచ్చన్ ఎమోషనల్ పోస్ట్

ఉన్న వివాదం చాలదన్నట్టు 3 కోట్లు పెట్టి మరో లగ్జరీ కారు అవసరమా

తమన్నాతో మెగాస్టార్ చిందులు.. అనిల్‌ మైండ్లో ఖతర్నాక్‌ ప్లాన్‌