Rahul Ravindran – Chinmayi: భార్య పై వస్తున్న ట్రోలింగ్ పై స్పందించిన రాహుల్..! ఏమన్నారంటే..

|

Jul 02, 2023 | 9:59 AM

సింగర్ చిన్మయి గురించి తెలియని వారు ఉండరు. ఆమె గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అలాగే తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. అలాగే ఆమె సమాజంలో జరిగే అన్యాయాల పై ఆమె గళం కూడా విప్పుతుంటారు.

సింగర్ చిన్మయి గురించి తెలియని వారు ఉండరు. ఆమె గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అలాగే తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. అలాగే ఆమె సమాజంలో జరిగే అన్యాయాల పై ఆమె గళం కూడా విప్పుతుంటారు. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై కూడా ఆమె మాట్లాడి వార్తల్లో నిలిచారు. అయితే ఆమె పై ట్రోలింగ్ కూడా గట్టిగానే జరుగుతుంది. చిన్మయి పై ప్రశంసలు కురిపించే వారు ఎంత మంది ఉన్నారో.. ట్రోల్ చేసే వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. అయితే తన పై వచ్చే ట్రోలింగ్స్ గురించి చిన్మయి పెద్దగా పట్టించుకోరు. అయితే తాజాగా చిన్మయి పై వస్తున్న ట్రోలింగ్స్ పై స్పందించారు ఆమె భర్త రాహుల్ రవీంద్రన్.

రాహుల్ రవీంద్రన్ హీరోగా అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హీరోగా పలు సినిమాల్లో నటించిన రాహుల్. ఆతర్వాత దర్శకుడిగా మారారు. చిలసౌ అనే సినిమాతో దర్శకుడిగా మారిన రాహుల్. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు. తాజాగా రాహుల్ తన భార్య పై వస్తున్న ట్రోల్స్ పై స్పందించారు. చిన్మయి చేసే పనులు గురించి చూడండి. ముందు ఆమె మాట వినండి. ఆమె చేసే పనులను మెచ్చుకోకపోయినా పర్లేదు అర్ధం చేసుకోండి. ముందు ఆమె మాట వినండి.. ఆతర్వాత ఏకీభవిస్తారా వ్యతిరేకిస్తారా అనేది మీ ఇష్టం అని చెప్పుకొచ్చారు రాహుల్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..