Raghava Lawrence: పేద విద్యార్థులకు పాఠశాలగా సొంత ఇల్లు.. సేవా గుణంలో.. రారాజుగా లారెన్స్
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తాను డ్యాన్స్ మాస్టర్‌గా కష్టపడి సంపాదించిన డబ్బుతో.. కొనుక్కున్న తన తొలి ఇంటిని పేద పిల్లల కోసం ఉచిత పాఠశాలగా మార్చుతున్నట్లు ప్రకటించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు ఈ స్టార్ కొరియోగ్రాఫర్ కమ్ హీరో. ఇటీవల కాలంలో తన సినిమాల కంటే సామాజిక సేవా కార్యక్రమాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు లారెన్స్.
సొంతంగా వృద్ధ, అనాథశ్రమాలు ఏర్పాటు చేసి ఎంతో మందికి నీడగా మారాడు. అలాగే అనాథ, పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నాడు. రైతులకు ట్రాక్టర్లు అందజేస్తున్నాడు. మహిళలకు కుట్టు మిషన్లు అందజేస్తున్నాడు. ఇటీవలే పూరి గుడిసెలో జీవిస్తున్న దివ్యాంగురాలు శ్వేత కుటుంబానికి స్కూటీ బహుమతిగా ఇచ్చి ఆమె కళ్లల్లో ఆనందాన్ని నింపాడు. ఈ క్రమంలోనే విద్యార్థుల చదువు కోసం మరో గొప్ప నిర్ణయం తీసుకున్నాడు లారెన్స్. తన సొంతింటిని పాఠశాలగా మారుస్తున్నట్టు ప్రకటించాడు. దీని ద్వారా మరికొంత మంది విద్యార్థులకు ఉచిత విద్య అందించన్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం నటిస్తున్న ‘కాంచన 4’ సినిమా అడ్వాన్స్‌తో ఈ సేవా కార్యక్రమం మొదలుపెట్టానని చెప్పాడు. ఆ ఇంట్లో పెరిగిన ఓ విద్యార్థి.. త్వరలో ప్రారంభం కానున్న ఆ పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వహించనున్నాడని లారెన్స్ తెలిపాడు. తాను పెంచి చదివించిన పిల్లలలో ఒకరు ఇప్పుడు టీచర్‌గా మారి, ఇదే పాఠశాలలో తొలి ఉపాధ్యాయురాలిగా చేరబోతున్నారని చెప్పడం తనకు మరింత ఆనందాన్ని ఇస్తోందన్నారు. సేవే దైవం అనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాను. మీ అందరి ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉండాలని లారెన్స్ ఈ సందర్భంగా చేసిన ట్వీట్లో రాసుకొచ్చాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rithu Chowdary: రీతూ పాపకి.. బిగ్ బాస్ భారీ నజరానా ??
Natural Star Nani: అరెరే.. నానికి భలే ఛాన్స్ మిస్ అయిందే
ఏడాదిలో 15 రోజులే పనిచేసే రైల్వే స్టేషన్
