అల్లు అర్జున్‌తో పోటీ.. పృథ్విరాజ్‌ సుకుమారన్‌ ఏమన్నారు ??

Edited By:

Updated on: Nov 20, 2025 | 3:50 PM

అల్లు అర్జున్ 'పుష్ప', పృథ్వీరాజ్ 'విలాయత్ బుద్ధ' మధ్య పోలికలు తీవ్ర చర్చనీయాంశం. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం, హీరో పాత్రల తీరు చూస్తుంటే కథలు ఒకేలా ఉన్నాయా అనే సందేహాలు. పృథ్వీరాజ్ 'పుష్ప'తో సంబంధం లేదని స్పష్టం చేసినా, ట్రైలర్ చూసిన తర్వాత అభిమానులు సారూప్యతలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఏ సినిమా రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.

సినిమాలో థీమ్‌ సేమా? హీరో కేరక్టర్‌ కూడా సేమేనా? లేకుంటే కథే ఆల్రెడీ చూసినట్టు ఉంటుందా? అసలు విలాయత్‌ బుద్ధకీ… పుష్పకీ పోలిక ఏంటి? అల్లు అర్జున్‌ రెండు పార్టుల సినిమాతో పృథ్విరాజ్‌ సింగిల్‌ పార్ట్ కి పోలిక ఎందుకొచ్చింది? ఏయ్‌ బిడ్డా ఇది నా అడ్డా అని అనే తీరులోనే.. అది నిజంగా పుష్పరాజ్‌ అడ్డానే అనే ఫీల్‌ని క్రియేట్‌ చేశారు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. ఆయన ఐకానిక్‌ యాక్టింగ్‌కి వరల్డ్ వైడ్‌ ఆడియన్స్ ఫిదా అయ్యారు. గంధపు చక్కల స్మగ్లింగ్‌ కథని, లోకల్‌ ఫ్లేవర్‌తో ఇంటర్నేషనల్‌ ఆడియన్స్ కి అర్థమయ్యేలా చెప్పారు సుకుమార్‌. పార్టీ లేదా పుష్పా అని అడిగే పోలీస్‌ ఆఫీసర్‌, హీరోకీ, అతనికీ మధ్య ఈగోక్లాషస్‌, మంచి స్పెషల్‌ నెంబర్స్ తో గుర్తుండిపోయే రికార్డులను క్రియేట్‌ చేశాడు పుష్పరాజ్‌. ఇప్పుడు ఇదే ఫ్లేవర్‌తో కనిపిస్తోంది విలాయత్‌ బుద్ధ. మా సినిమాలో నేను గంధపు చక్కల స్మగ్లర్‌గా నటించిన విషయం ఓకే. పుష్ప సినిమాకీ, మా మూవీకీ ఎలాంటి సంబంధం ఉండదు. రెండు కథలూ వేర్వేరు.. దయచేసి పోల్చవద్దు అని ఓపెన్‌గా చెప్పేస్తున్నారు పృథ్విరాజ్‌ సుకుమారన్‌. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన ట్రైలర్‌ని చూసిన వారు మాత్రం ఎక్కడో పోల్చి చూస్తూనే ఉన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కథతో తెరకెక్కిన పృథ్విరాజ్‌ సినిమా… అల్లు అర్జున్‌ మూవీస్‌ రికార్డులను టచ్‌ చేయగలదా? పుష్ప లాగా వైరల్‌ అవుతుందా? అంటూ రకరకాలుగా చర్చ జరుగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rajamouli: ఇంటర్నేషనల్‌ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన జక్కన్న.. మరీ ఇంత అడ్వాన్స్ గానా

సిల్వర్ స్క్రీన్ మీద రిపీట్‌ అవుతున్న జోడీలు.. మళ్లీ కుదురుతున్నట్టేనా ??

Nayanthara: సింహా జోడీకి సూపర్‌క్రేజ్‌.. మహారాణి వచ్చేస్తున్నారహో

పాన్ ఇండియా డైరెక్టర్లు.. పక్కా లోకల్‌ సినిమాలు చేసేదెప్పుడు

పాక్‌ ఉగ్ర కుట్రలు.. బిర్యానీ,దావత్ కోడ్ తో..

Published on: Nov 20, 2025 03:49 PM