డాక్యుమెంటరీగా.. ప్రొద్దుటూరు దసరా సంబరం

Updated on: Sep 10, 2025 | 3:00 PM

మరి కొన్ని రోజుల్లో దసరా పండగ వస్తోంది. ఈ క్రమంలోనే అందరూ తమ ఊర్లో జరగబోయే దసరా గురించి గుర్తు చేసుకుంటూనే ఉంటారుగా..! మీ ఫ్రెండ్స్‌ కో.. కొలీగ్స్‌కో మీ ఊరి దసరా విశేషాలను వివరిస్తూనే ఉంటారుగా.. ! ఇప్పుడు డైరెక్టర్ కరుణ కుమార్ కూడా అదే చేశారు. ప్రొద్దుటూరులో జరిగే దసరా సంబరాలను డాక్యుమెంటరీగా తెరకెక్కించాడు.

ప్రొద్దుటూరు దసరా చరిత్రను డాక్యుమెంటరీగా మన ముందుకు తీసుకొచ్చాడు. బాల్కనీ ఒరిజినల్స్, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో ప్రేమ్ కుమార్ వలపల నిర్మాతగా తీసిన డాక్యుమెంటరీ ‘ప్రొద్దుటూరు దసరా’. మురళీ కృష్ణ తుమ్మ ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించాడు. అయితే మరికొన్ని రోజుల్లో దసరా సంబరాలు మొదలు కానున్న నేపథ్యంలో.. ఈ డాక్యుమెంటరీని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రత్యేక ప్రదర్శనకు కరుణ కుమార్, విప్లవ్, మహేష్ విట్టా, ఉదయ్ గుర్రాల ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక డాక్యుమెంటరీ స్క్రీనింగ్ తర్వాత మాట్లాడిన దర్శకుడు కరుణ కుమార్ .. ఓ డాక్యుమెంటరీని సరిగ్గా మంచి నేపథ్యంతో తెరకెక్కిస్తే.. దానికి సినిమా కంటే పెద్ద రీచ్‌ ఉంటుందన్నాడు. అలాంటి డాక్యుమెంటరీనే తన ప్రొద్దుటూరు దసరా డాక్యుమెంటరీ అంటూ చెప్పాడు. తన డాక్యుమెంటరీ ఎంతో ఎంగేజింగ్‌గా ఉంటుందని… డాక్యుమెంటరీ ఇలానే తీయాలన్న రూల్‌ను బ్రేక్ చేస్తూ.. ఎంతో ఎంగేజింగ్‌గా ప్రొద్దుటూరు డాక్యుమెంటరీని తాను తెరకెక్కించానంటూ చెప్పాడు. అందుకోసం ఏఐ సాయం కూడా తీసుకున్నట్టు చెప్పుకొచ్చాడు. నా డాక్యుమెంటరీ దృశ్యరూపంలో ఉండే చరిత్ర అంటూ గట్టిగా చెప్పాడు డైరెక్టర్ కరుణ కుమార్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Boney Kapoor: నన్ను రూమ్‌కి కూడా రానిచ్చేది కాదు..

కొడుకు లేడు.. కూతుళ్లు లేరు ఆ లగ్జరీ బంగ్లా నాకెందుకు ?? స్టార్‌ కపుల్‌.. షాకింగ్ నిర్ణయం!

‘స్పిరిట్’ పై సందీప్ రెడ్డి అప్ డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు

TOP 9 ET News: అల్లు కుటుంబానికి GHMC షాక్‌ కూల్చేస్తామంటూ నోటీస్‌

భరణికి మెగా సపోర్ట్‌ !! వర్కవుట్ అవుతుందా ?? లేక..