Priyanka Chopra: ప్రియాంక తెలుగు ఎంత క్యూట్‌గా ఉందో
మహేష్-రాజమౌళి 'వారణాసి' చిత్ర గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్‌లో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా వచ్చీరాని తెలుగుతో ఆకట్టుకున్నారు. ‘తగలబెట్టేద్దామా?’ అంటూ ఆమె మాట్లాడిన క్యూట్ డైలాగ్ నెట్టింట వైరల్‌గా మారింది. తెలుగు నేర్చుకోవడానికి ఆమె చూపిన అంకితభావానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ చిత్రంలో 'మందాకిని' పాత్రలో ప్రియాంక హీరోయిన్‌గా నటిస్తున్నారు.
తెలుగు రానివారు అప్పుడే తెలుగు నేర్చుకుంటూ మాట్లాడే మాటలు ఎంతో క్యూట్‌గా ఉంటాయి. వచ్చీరాని తెలుగుతో అలా అందరినీ ఆకట్టుకుంటారు కొందరు. ఇప్పడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా అలానే వచ్చీరాని తెలుగుతో ఆడియన్స్ మనసు గెలుచుకున్నారు. ఇటీవల మహేశ్ బాబు ,రాజమౌళి కాంబోలో తెరకెక్కతోన్న వారణాసి ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్‌సిటీలో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో ఎలాగైనా తెలుగులో మాట్లాడాలని తెలుగు నేర్చుకొని మరి వచ్చింది ప్రియాంక. తను తెలుగు ప్రాక్టీస్ చేసిన వీడియోను ప్రియాంక సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘తగలబెట్టేద్దామా’ అంటూ క్యూట్‌గా మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వారణాసి టైటిల్ అనౌన్స్‌మెంట్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో గ్రాండ్‌గా జరిగింది. మహేష్ ఫస్ట్‌లుక్, గ్లింప్స్‌తో జక్కన్న ప్రపంచానికి కొత్త రూపాన్ని పరిచయం చేస్తే, బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఈవెంట్‌లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. స్టేజ్‌పైకి వచ్చిన ప్రియాంక చోప్రా తెలుగులో “హలో హైదరాబాద్”, “తగలబెట్టేద్దామా?” అంటూ అభిమానులను పలకరించడంతో హాల్ అంతా హర్షధ్వానాలతో మార్మోగింది. ఈ క్యూట్ తెలుగు డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రియాంక డెడికేషన్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. “సినిమాలో కంటే లైవ్ స్టేజ్‌పై తెలుగు మాట్లాడడం చాలా కష్టం” అంటూ ప్రియాంక చెప్పిన మాటలు అందరినీ ఆకర్షించాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక డైరీ మెయింటైన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ‘వారణాసి’ చిత్రంలో ప్రియాంకనే హీరోయిన్ అని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఆమె ‘మందాకిని’ పాత్రలో కనిపించనున్నారు.ఇప్పటికే విడుదలైన ఆమె ఫస్ట్‌లుక్ భారీ హైప్ క్రియేట్ చేస్తుంది. గుహలో దేవతా విగ్రహాల మధ్య చీర కట్టుకుని గన్ పట్టుకుని కనిపించిన మాస్ అవతారం అందరినీ ఆశ్చర్యపరిచింది. మహేష్ – రాజమౌళి కాంబినేషన్‌కు తోడు ప్రియాంక చోప్రా శక్తివంతమైన పాత్రలో కనిపించబోతుండటంతో ‘వారణాసి’పై ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరిగాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: రూటు మార్చిన దొంగలు.. ముసుగులు ధరించి
తిరుమల భక్తులకు అలర్ట్ వైకుంఠ ద్వార దర్శనాలపై అప్ డేట్
Chandrababu Naidu: చంద్రబాబు నిద్రను డిసైడ్ చేసేది ఈ ఆరా రింగే !! స్పెషల్ ఏమిటో తెలుసా ??
రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్ పరీక్షలు ఎప్పుడంటే
