Priyamani-Bhamakalapam 2: భామ కాదు.! చెడుగుడు ఆడే బాంబు.. నా పని నేను చేసుకుంటా: ప్రియమణి.

Updated on: Feb 01, 2024 | 10:40 AM

కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనే కాకుండా.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియమణి. కానీ ఆ తర్వాత తెలుగులో ఆఫర్స్ తగ్గడంతో.. కొంత కాలం గ్యాప్ తీసుకున్న ప్రియమణి.. బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చింది. పలు రియాల్టీ షోలలో జడ్జీగా వ్యవహరించింది. ఇక ఆ తర్వాతే ఓటీటీలో 'భామా కలాపం' సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. 2022 ఫిబ్రవరిలో వచ్చిన ఓటీటీలో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది.

కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనే కాకుండా.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియమణి. కానీ ఆ తర్వాత తెలుగులో ఆఫర్స్ తగ్గడంతో.. కొంత కాలం గ్యాప్ తీసుకున్న ప్రియమణి.. బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చింది. పలు రియాల్టీ షోలలో జడ్జీగా వ్యవహరించింది. ఇక ఆ తర్వాతే ఓటీటీలో ‘భామా కలాపం’ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. 2022 ఫిబ్రవరిలో వచ్చిన ఓటీటీలో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. థ్రిల్లర్, డార్క్ కామెడీగా వచ్చిన ఈ మూవీ ఆహా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాకు ఆదరణ లభించడంతో..ఇప్పుడు దీనికి సీక్వెల్ తీసుకువస్తున్నారు. భామా కలాపం 2 టైటిల్‍తో సీక్వెల్ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైనట్లుగా తెలుస్తోంది. అయితే ఈసారి నేరుగా ఓటీటీలోకి కాకుండా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

తాజాగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. అనుపమ అనే నేను .. పక్కన వాళ్ల విషయాల్లో తలదూర్చనని.. నా పని నేను చేసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తూ కనిపిస్తుంది ప్రియామణి. తాజాగా విడుదలైన టీజర్ ఆసక్తిని కలిగిస్తోంది. మొదటి పార్ట్ లో కథంతా ప్రియమణి చుట్టూ తిరిగినట్టుగానే రెండో పార్ట్ కూడా ఆమె కేంద్రంగానే నడవనున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రానికి అభిమన్యూ దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో సీరత్ కపూర్, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ విహారీ సంగీతం అందిస్తున్నారు.తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే.. ఈసారి సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎంటర్టైన్మేంట్ తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి బాపినీడు బీ, సుధీర్ ఎదార.. నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రుచికరమైన హెయిస్ట్ ఫీస్ట్ అనే ట్యాగ్ లైన్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా థియేటర్లలో ఫిబ్రవరి 16న రిలీజ్ కానుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos