రిస్క్ చేస్తున్న మేకర్స్.. ప్రీ ఇండిపెండెన్స్ కథల మీద అంత నమ్మకమేంటి?
పాన్ ఇండియా విజయాల కోసం టాలీవుడ్ మేకర్స్ ఇప్పుడు ప్రీ-ఇండిపెండెన్స్ కథలపై దృష్టి పెడుతున్నారు. ప్రభాస్ ‘ఫౌజీ’, విజయ్ దేవరకొండ ‘రణబాలి’, నిఖిల్ ‘ది ఇండియా హౌస్’ వంటి చిత్రాలు స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథలతో తెరకెక్కుతున్నాయి. యూనివర్సల్ అప్పీల్, దేశభక్తి, భావోద్వేగాల కలయికతో ఈ సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని మేకర్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
మన మేకర్స్ రొటీన్ ఫార్ములా కథలను పక్కన పెట్టేశారు. పాన్ ఇండియా ట్రెండ్‌లో ప్రూవ్ చేసుకోవాలంటే యూనివర్సల్ అప్పీల్ ఉన్న సబ్జెక్ట్స్ అయితేనే కరెక్ట్ అని ఫీల్ అవుతున్నారు. అందుకే ప్రీ ఇండిపెండెన్స్ ఎరా మీద కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరూ ఇలాంటి కథ మీదే దృష్టి పెడుతున్నారు. ది రాజాసాబ్ నిరాశపరిచినా.. ప్రభాస్ నెక్ట్స్ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాలో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి సైనికుడిగా కనిపించబోతున్నారు ప్రభాస్. యుద్ధం, ప్రేమ రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఇలాంటి కథను సిద్ధం చేస్తున్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రణబాలి సినిమాలో బ్రిటీష్ అధికారుల మీద పోరాటం చేసే వ్యక్తిగా కనిపించబోతున్నారు వీడీ. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ప్రమోషన్ కంటెంట్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. నిఖిల్ హీరోగా రామ్ చరణ్ నిర్మిస్తున్న ది ఇండియా హౌస్ మూవీ కూడా స్వతంత్రానికి ముందు జరిగే కథగానే తెరకెక్కుతోంది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో నిఖిల్ పోరాట యోధుగా కనిపించబోతున్నారు. అంతకన్నా ముందు స్వయంభూ సినిమాతో ఫోక్‌లోర్ జానర్ టచ్ చేస్తున్నారు ఈ యంగ్ హీరో. ఈ జానర్ బడ్జెట్, మేకింగ్ పరంగా రిస్క్ అయినా మేకర్స్ మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు. యూనివర్స్ అప్పీల్ ఉండటం, పాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లటం ఈజీ అన్న ఉద్దేశంతోనే ఈ జానర్‌ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. మరి మేకర్స్ నమ్మకాన్ని ఈ సినిమాలు ఎంత వరకు నిలబెడతాయో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Lets Fix Our Food: ఊబకాయంపై యుద్ధం.. ICMR-NIN సంచలన నివేదిక
కెమెరామెన్‌కి బంపరాఫర్.. యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!
బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!
Weather Update: దూసుకొస్తున్న వాయు‘గండం’.. దంచికొట్టనున్న వర్షాలు.. వచ్చే మూడు రోజులు ముసురే
Cyber Crime:పార్శిల్ వచ్చింది.. రూ.22 పే చేయమని మెసేస్ వచ్చిందా.. అయితే.. బీ అలర్ట్!
