The Raja saab: రాజాసాబ్‌ను టార్గెట్ చేసిందెవరు ?? ప్రభాస్ సినిమాకే ఎందుకిలా జరుగుతోంది
ది రాజాసాబ్ సినిమా రిలీజ్ తేదీ, బిజినెస్ విషయమై వదంతులు నిరంతరం వ్యాపిస్తున్నాయి. నిర్మాత విశ్వప్రసాద్ ఈ రూమర్స్‌ను ఖండించారు. నాన్-థియేట్రికల్ బిజినెస్ అంచనాలకు తగ్గట్టుగా లేదన్న ప్రచారం అవాస్తవం అన్నారు. ఫైనాన్స్ సమస్యలు లేవని, సినిమా జనవరి 9న విడుదల అవుతుందని స్పష్టం చేశారు.
ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ సినిమా చుట్టూ వదంతులు ఆగడం లేదు. ఎంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా, సినిమా విడుదల తేదీ, బిజినెస్ విషయాలపై నెగిటివ్ వార్తలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. దీంతో ప్రతిసారీ చిత్ర నిర్మాతలు స్పష్టత ఇవ్వాల్సి వస్తోంది. తాజాగా, చిత్ర నిర్మాత విశ్వప్రసాద్ మరోసారి ఈ రూమర్స్‌పై స్పందించారు. కొద్దిరోజులుగా ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్ బిజినెస్ గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, సినిమా నాన్-థియేట్రికల్ బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగలేదని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై అలెర్ట్ అయిన మేకర్స్ వెంటనే వివరణ ఇచ్చారు. ది రాజాసాబ్ భారీ ప్రాజెక్ట్ అని పేర్కొన్న నిర్మాత విశ్వప్రసాద్, సినిమా బిజినెస్ లెక్కలు బయటకు వెల్లడించమని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమని, సినిమా విడుదలయ్యాక అధికారికంగా అన్ని వివరాలను అభిమానులతో పంచుకుంటామని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
2026 మీదే ఆశలు.. కొత్త ఏడాది కలిసొస్తుందా..?
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు
యూరియా బుకింగ్ షురూ.. ఆన్‌లైన్‌లో ఎలా చేసుకోవాలి అంటే
ప్రియురాలి పేరుతో ఇల్లు కొని.. తల్లి పేరుతో రిజిస్ట్రేషన్.. ఆ తర్వాత
