‘స్పిరిట్’ పై సందీప్ రెడ్డి అప్ డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు
రెబల్ స్టార్ ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’. సెట్స్‌పైకి వెళ్లకముందే అద్భుతమైన హైప్ క్రియేట్ చేస్తోంది. 2024లో యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఇప్పటికే ఈ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచీ హైప్ మామూలుగా లేదు.
ఏ చిన్న అప్డేట్ వచ్చినా నిమిషాల్లోనే ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసారు సందీప్ వంగా. అయితే ప్రభాస్ సినిమా అంటే కనీసం ఏడాది ఖాయం.. కానీ సందీప్ మాత్రం రికార్డ్ టైమ్‌లో పూర్తి చేయాలని చూస్తున్నారు. స్పిరిట్ రీ రికార్డింగ్ 70 శాతం పూర్తైందని చెప్పి షాకిచ్చారు వంగా. అన్నీ అనుకున్నట్లు జరిగితే స్పిరిట్ షూట్ 90 రోజుల్లోనే పూర్తి చేసి.. ఆర్నెళ్లలో సినిమా విడుదల చేయాలని చూస్తున్నామని సందీప్ వంగా తెలిపారు. డార్లింగ్‌ని సందీప్ రెడ్డి ఆకాశానికెత్తేశాడు. ‘ప్రభాస్‌లో స్టార్ హీరో అన్న అహం, గర్వం ఎక్కడా కనిపించదు. ఆయన చాలా నిజాయతీపరుడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కోపం ప్రదర్శించడు. నేను అనుకున్న దానికంటే ఎక్కువగానే ‘స్పిరిట్’ మూవీకి సహకరిస్తున్నాడన్నారు. హై ఓల్టేజ్ కాప్ యాక్షన్ థ్రిల్లర్‌గా మూవీని తెరకెక్కించబోతున్నారు. మోస్ట్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ చిత్రంపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: అల్లు కుటుంబానికి GHMC షాక్ కూల్చేస్తామంటూ నోటీస్
భరణికి మెగా సపోర్ట్ !! వర్కవుట్ అవుతుందా ?? లేక..
పైన పటారం.. లోన లొటారం..! బిగ్ బాస్ గుట్టు రట్టు చేసిన తేజస్వి
