రెండు పార్టులు‌గా రానున్న ప్రభాస్ ఫౌజీ ?? ఆనందంలో అభిమానులు

Edited By: Phani CH

Updated on: Nov 19, 2025 | 3:07 PM

ప్రభాస్ సినిమాలకు పార్ట్ 2 ఉంటుందని అభిమానులు ఊహిస్తున్నారు. అయితే, ఫౌజీ మేకర్స్ మాత్రం ముందుగా సీక్వెల్ ప్లాన్ చేయలేదని చెబుతున్నారు. స్టోరీ సిట్టింగ్స్‌లో ఒక ప్రీక్వెల్ ఆలోచన వచ్చిందని, దానిని కాంతార తరహాలో విడుదల చేసే అవకాశం ఉందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా ఇది ఆలస్యం కావచ్చు.

ప్రభాస్‌ పేరు చెప్పగానే ముందూ వెనుకా ఆలోచించకుండా ఆయన సినిమాలన్నిటికీ పార్ట్ 2 ఉంటాయని ఫిక్సయిపోతున్నారు జనాలు. అన్ని సినిమాల సంగతులేమోగానీ, మా ఆలోచన వేరు.. అని అంటుననారు ఫౌజీ మేకర్స్. ఇంతకీ ఆ సంగతులేంటి? వైరల్‌ అవుతున్నట్టు ఫౌజీకి సెకండ్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ ఉందా? లేకపోతే ఆ వార్త ఎందుకు చక్కర్లు కొడుతోంది? చూసేద్దాం వచ్చేయండి. బాహుబలి సినిమా నుంచి మొదలైంది డార్లింగ్‌ ప్రభాస్‌ రెండు భాగాల ప్రభంజనం. ఆ సినిమా క్లిక్‌ కావడంతో ప్రతి సినిమాకీ కొనసాగింపు ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్. మిగిలిన వాళ్ల సంగతేమోగానీ, మాకు అలాంటి ప్లాన్స్ ఏవీ లేవంటోంది ఫౌజీ టీమ్‌. ఫౌజీ మూవీ స్టోరీ సిట్టింగ్స్ లో ఉన్నప్పుడు, ఓ థాట్‌ రాగా… దాన్ని ప్రీక్వెల్‌ చేస్తే బావుంటుందని అనుకున్నారట. అది కాస్తా వైరల్‌ అయి… ఇప్పుడు తీస్తున్నది సెకండ్‌ పార్ట్. దీన్ని మొదట విడుదల చేసి కాంతార టైప్‌లో ప్రీక్వెల్‌ని మళ్లీ రిలీజ్‌ చేయడానికి మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారనే రూమర్‌ స్ప్రెడ్‌ అయింది. అయినా ప్రభాస్‌ చేయాల్సిన సీక్వెల్స్ ఇప్పుడు చాలానే ఉన్నాయి. ఓ వైపు సలార్‌ని కంప్లీట్‌ చేయాలి.. ఆ తర్వాత కల్కి2 ఉంది. రాజాసాబ్‌కి సెకండ్‌ పార్ట్ ఉండే ఛాన్సులున్నాయి.. ఇవన్నీ కాక ఫౌజీకి రావాలంటే ఏ 2028 – 2029 అవుతుందేమో.. అప్పటికి ఈ ప్రీక్వెల్‌ ఐడియా కంప్లీట్‌గా కథగా మారితే ఒకవేళ చేసినా చేస్తారేమో.. అప్పటిదాకా మాత్రం ఛాన్స్ లేదు. ప్రస్తుతం డార్లింగ్‌ సీక్వెల్స్ అన్నిటిలోకీ జనాల అటెన్షన్‌ గ్రాబ్‌ చేస్తోంది మాత్రం కల్కి సీక్వెల్‌ అన్నదే వాస్తవం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైరల్‌ వయ్యారికి లేడీ సూపర్‌స్టార్‌ సలహాలు.. ఇంకా హిట్ పక్కనా ??

వరుస షూటింగ్స్ తో షేక్ అవుతున్న లొకేషన్స్..

Top9 ET: ‘వారణాసి’ టైటిల్‌ వివాదం జక్కన్నకు దెబ్బ మీద దెబ్బ

పాపులారిటీ ఏమో కానీ.. తన భర్త విషయంలో ఈ నటికి తీవ్ర బాధ

Babar Azam: బాబర్‌పై ఐసీసీ కొరడా.. లెవల్ 1 నిబంధనను ఉల్లంఘించినందుకు ఫైన్‌