Prabhas: డ్యాన్స్‌ మాస్టర్‌కు .. గొప్ప ఛాన్స్‌ ఇచ్చిన ప్రభాస్‌

Updated on: Nov 17, 2025 | 1:46 PM

ప్రభాస్ తన పాన్ ఇండియా సినిమాల మధ్య 'నాటు నాటు' ఫేమ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌కు దర్శకుడిగా బంపర్ ఛాన్స్ ఇచ్చినట్లు టాలీవుడ్‌లో టాక్. ప్రభుదేవా, లారెన్స్‌లకు ఇచ్చినట్లే, ఇప్పుడు ప్రేమ్ రక్షిత్‌ కథకు ప్రభాస్ దాదాపు ఓకే చెప్పినట్లు వార్తలున్నాయి. ఛత్రపతి నుండి వీరిద్దరి మధ్య అనుబంధం ఉంది. ఈ కొత్త కాంబోపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఇప్పుడంటే పాన్ ఇండియా లైనప్స్‌తో బిజీగా ఉన్నాడు కానీ.. అంతకు ముందు ప్రభాస్‌.. సరైన సినిమాలను ఎంచుకుంటూనే.. తనను నమ్మిన డైరెక్టర్లకు ఛాన్స్ లిచ్చేవాడు. అలా డ్యాన్స్‌ మాస్టర్‌గా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ప్రభుదేవా, లారెన్స్‌లకు అడగగానే డేట్లు ఇచ్చాడు. వారి డైరెక్షన్లో సినిమాలు చేశాడు. ఇక ఇప్పుడు మరో సారి మన డార్లింగ్ స్టార్ కొరియోగ్రాఫర్ ప్రమ్‌ రక్షిత్‌కు కూడా డైరెక్టర్‌గా బంపర్ ఛాన్స్‌ ఇచ్చినట్టు ఇన్‌సైడ్ న్యూస్. సీనియర్ డ్యాన్స్ మాస్టర్, RRR లో నాటు నాటు సాంగ్ తో వరల్డ్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్న ప్రేమ్ రక్షిత్ దర్శకుడిగా మారబోతున్నాడు. ఎప్పటి నుంచో ఇందుకోసం ప్రయత్నాలు చేస్తున్న ఈయనకు.. ఎట్ ప్రజెంట్ ప్రభాస్‌ ఛాన్స్ ఇచ్చారని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. అంతేకాదు ఆల్రెడీ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ప్రభాస్ కి కథ చెప్పాడని, ప్రభాస్ కూడా ఆల్మోస్ట్ ఓకే చెప్పారని న్యూస్ నడుస్తోంది. ఇక ప్రేమ్ రక్షిత్ కెరీర్ కొరియోగ్రాఫర్ గా మొదలైంది ప్రభాస్ ఛత్రపతి సినిమాతోనే. ఆ తర్వాత బిల్లా, డార్లింగ్, బాహుబలి సినిమాలకు ప్రభాస్ తో కలిసి పనిచేసాడు ప్రేమ్ రక్షిత్ మాస్టర్. దీంతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధమే ఉంది. ఈ క్రమంలోనే వీరి కాంబో సెట్టు అవుతుందో లేదో చూడాలంటూ ఫ్యాన్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

White Hair: తెల్ల జుట్టు మంచిదే.. క్యాన్సర్ ను అడ్డుకుంటుందట

సమోసా తింటున్నారా.. తప్పనిసరిగా ఇలా చేయండి.. లేదంటే

దెయ్యాన్ని చూసి భయపడిన ఎలుగుబంటి ఏం చేసిందంటే.. మస్త్ ఫీల్ ఉంది మామా

బంగాళాఖాతంలో అల్పపీడనం..దంచికొట్టనున్న వర్షాలు !!

World Largest Spider Web: అద్భుతం.. ప్రపంచంలోనే అతి పెద్ద సాలెగూడు..