Prabhas: ‘మిరాయ్’కి ప్రభాస్ ఎంత తీసుకున్నారంటే..?

Updated on: Sep 15, 2025 | 4:19 PM

సినిమా హిట్ కావాలంటే స్టార్ హీరోలు, భారీ హంగులు, ఐటెమ్ సాంగులు అవసరం లేదని సరైన కంటెంట్ ఉంటే చాలని నిరూపించింది ‘ మిరాయ్ ’ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ 27.20 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సాధారణ టిక్కెట్ ధరలతో ఈ రేంజ్ కలెక్షన్లు సాధించి బ్రహ్మాండ్ బ్లాక్‌బస్టర్ అయిందంటూ పోస్టర్ రిలీజ్ చేసింది.

మిరాయ్‌ చిత్రానికి సంబంధించి ఓ విషయం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అదే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రెమ్యునరేషన్. ఈ మూవీ ప్రభాస్ వాయిస్‌తోనే ప్రారంభమవుతుంది. ఇందులో ఆయన నటించలేదు. కానీ రాముడిగా ప్రభాస్ ఫోటో తెగ వైరల్ అయింది. ప్రభాస్ ఫేస్‌తో పాటు ఆయన వాయిస్‌ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ చేశారు మేకర్స్. మరి ఇందులో ప్రభాస్ నేరుగా నటించనప్పుడు రెమ్యునరేషన్ ప్రస్తావన ఎందుకొస్తుంది అని కొందరు అంటుండగా, ప్రభాస్ నేరుగా నటించకపోయినా ఆయన ఫోటో, వాయిస్‌ని వాడుకున్నందుకు డబ్బులు ఇవ్వాలని, ఈ క్రమంలో ప్రభాస్‌కి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ఉండొచ్చనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే.. వాస్తవం ఏమిటంటే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌తో తనకున్న సాన్నిహిత్యం కారణంగా ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ‘ది రాజా సాబ్’ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీయే నిర్మిస్తోంది. ప్రభాస్‌ రెమ్యునరేషన్ తీసుకోకుండా ‘మిరాయ్’ మూవీకి సాయం చేశారని తెలుస్తోంది. తమ ఫోటోలు, ట్యూన్లు వాడుకున్నందుకే కోట్ల రూపాయలు చెల్లించాలంటూ కొంతమంది సెలబ్రెటీలు కోర్టులకు ఎక్కుతోన్న ఈ కాలంలో ప్రభాస్ వేరే చిత్రానికి ఇంత సాయం చేసి కూడా ఒక్క రూపాయి తీసుకోకపోవడం ఆయన మంచితనాన్ని తెలియజేస్తోందని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గతంలో మంచు విష్ణు నటించి నిర్మించిన ‘కన్నప్ప’ మూవీలో ప్రభాస్ కీలక పాత్రలో నటించారు. మోహన్‌బాబుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆ చిత్రానికి కూడా ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు ఇతర చిత్రాలకు సాయం చేస్తోన్న ప్రభాస్‌ని చూసి ఇతర సెలబ్రెటీలు ఎంతో నేర్చుకోవాలని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మరణంలోనూ వీడని బంధం.. భార్య మృతిని తట్టుకోలేక భర్త మృతి

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు