Kalki 2898 AD: సంతోషంలో.. సంబరాలు.. రెబల్ ఫ్యాన్స్‌తో మామూలుగా ఉండదు..
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన కల్కి సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన రెండు వారాల్లోనే కల్కి సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరింది.
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన కల్కి సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన రెండు వారాల్లోనే కల్కి సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వరల్డ్ వైడ్ గానూ కల్కి సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ప్రస్తుతం బరిలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ప్రభాస్ సినిమా దూకుడు ఇప్పట్లో ఆగేలా లేదు. ఎక్కడ చూసినా కల్కి థియేటర్లు హౌజ్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. దీంతో చిత్ర బృందం ఫుల్ ఖుషీ అవుతోంది.
ఇక ఈ నేపథ్యంలో తాజాగా కల్కి మూవీ సక్సెస్ వేడుకను చిత్రబృంద సభ్యులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ భాజా భజంత్రీలతో ఈ విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత అశ్వనీదత్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను వైజయంతి మూవీస్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కల్కి సినిమాలో లోక నాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే రామ్ గోపాల్ వర్మ, బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మాళవిక నాయర్, మృణాళ్ ఠాకూర్ తదితరులు క్యామియో రోల్స్ లో మెరిశారు. వైజయంతీ మూవీస్ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా కల్కి సినిమాను నిర్మించింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానుంది. దీనిపై నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వనీదత్ కూడా క్లారిటీ ఇచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.