ప్రభాస్‌కు కన్ఫ్యూజన్.. ఎలా తేల్చుకుంటారో ఏమో..?
ప్రభాస్ తన రెండు భారీ చిత్రాలు ఫౌజీ, స్పిరిట్ మధ్య సమన్వయం సాధించడంలో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. డిసెంబర్ 3న విడుదల కానున్న ఫౌజీ ప్రమోషన్స్ సెప్టెంబర్ నుంచే ప్రారంభం కాగనుండగా, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. ఈ రెండు చిత్రాల మధ్య సమయం కేటాయింపు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ప్రభాస్ చేతి నిండా సినిమాలు, భారీ బడ్జెట్లు, అగ్ర దర్శకులతో బిజీగా ఉన్నారు. అయితే, ఈ భారీ చిత్రాల మధ్య సమన్వయం చేసుకోవడంలో ఆయనకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఫౌజీ మరియు స్పిరిట్ చిత్రాల విషయంలో ఈ సందిగ్ధత స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం. ప్రభాస్ ఫోకస్ అంతా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ఫౌజీపైనే ఉంది. ఈ చిత్రం డిసెంబర్ 3న విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని తెలిపిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ నుంచే ఫౌజీ ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి. ఈ సినిమా ద్వారా ఈమాన్వి హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు.మరోవైపు, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ సినిమా షూటింగ్ ఇప్పటికే 40% పూర్తయింది. మేకర్స్ ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2027 మార్చి 5న విడుదల చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అనుకున్న సమయానికి స్పిరిట్ రావాలంటే నాన్ స్టాప్‌గాషూటింగ్ జరగాల్సి ఉంది. అయితే, ఫౌజీ ప్రమోషన్స్ కోసం ప్రభాస్ సమయం కేటాయిస్తే, స్పిరిట్ షూటింగ్‌కు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రెండు చిత్రాలలో ఏ ఒక్కటి ఆలస్యమైనా, దాని ప్రభావం రెండో దానిపై పడటం ఖాయం. ఒకేసారి రెండు సినిమాలతో రాబోతున్న డార్లింగ్ ప్రభాస్ వీటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని వీడియోల కోసం :
బయోపిక్స్‌లో ఒదిగిపోతున్న హీరోయిన్లు
హీరోలను డామినేట్ చేస్తున్న విలన్లు
క్రేజీగా కమల్ లైనప్… షూటింగ్ స్టేటసేంటి?
టాలీవుడ్‌లో మరోసారి ముదురుతున్న డ్యాన్సర్స్ అసోసియేషన్ రచ్చ
థియేటర్లలో మున్నా భయ్యా రచ్చ.. మూవీగా ‘మిర్జాపూర్’ ఎలా ఉంది?
