ADIPURUSH 3D Teaser: 3D లో ఆదిపురుష్ టీజర్.. హైదరాబాద్ వేదికగా లాంచ్.. ప్రభాస్ అదిరిపోయే స్పీచ్..(లైవ్)

| Edited By: Ravi Kiran

Oct 06, 2022 | 7:57 PM

బహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు యంగ్ హీరో ప్రభాస్.. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ప్రభాస్ అభిమానుల ఉత్సాహాన్ని చూసి..


బహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు యంగ్ హీరో ప్రభాస్.. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ప్రభాస్ అభిమానుల ఉత్సాహాన్ని చూసి అక్టోబర్ 2న ప్రభాస్ ‘ఆదిపురుష’ టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.ఆదిపురుష’ అనేది పౌరాణిక నేపధ్య సినిమా. ఇందులో ప్రభాస్ శ్రీరాముని పాత్రను పోషిస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ లంకాధిపతి రావణబ్రహ్మ గా నటిస్తున్నాడు. ఆయన చివరిగా ‘విక్రమ్ వేద’ చిత్రంలో కనిపించారు. ఈ చిత్రంతో సైఫ్ అలీ ఖాన్  తెలుగులో  అరంగేట్రం చేయనున్నాడు. కృతి సనన్ , సన్నీ సింగ్ ‘ఆదిపురుష్’లో ప్రభాస్ , సైఫ్ అలీ ఖాన్‌లతో కలిసి కనిపించనున్నారు. దీని తెలుగు వెర్షన్ హక్కులను యూవీ క్రియేషన్స్ 100 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

Published on: Oct 06, 2022 07:39 PM