Pawan Kalyan: ఒకటీ రెండు కాదు.. పవర్‌స్టార్‌ మూడు ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నారా

Edited By:

Updated on: Jan 27, 2026 | 6:52 PM

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త! ఈ ఏడాది పవన్ ఒకటీ కాదు, మూడు సినిమాలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న సినిమా ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. అంతేకాకుండా, మూడో ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి. రాజకీయాలతో పాటు సినిమాలను సమర్థవంతంగా బ్యాలెన్స్ చేస్తూ, అభిమానులకు పవన్ కళ్యాణ్ డబుల్ ధమాకా అందించనున్నారు.

మెగా స్టార్‌ ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్‌ చేశారు. ఇంకో సినిమా క్యూలో ఉంది. ప్రభాస్‌ ఓ సినిమా రిలీజ్‌ చేశారు.. మరో సినిమా లైన్లో ఉంది.. ఇలాగే చాలా మంది హీరోలు ఈ ఏడాది డబుల్‌ ధమాకా ప్లాన్‌ చేసుకుంటున్నారు. మరి మా స్టార్‌ సంగతేంటి? అని ఆలోచనలో పడ్డారు పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అభిమానులు.. అస్సలు అలాంటి థింకింగే వద్దు… ఒకటీ, రెండూ, కాదు.. మూడోది కూడా ప్లాన్‌ చేసేద్దామని హింట్స్ అందుతున్నాయి పవర్‌స్టార్‌ కాంపౌండ్‌ నుంచి… లాస్ట్ ఇయర్‌ బ్యాక్ టు బ్యాక్‌ పబ్లిసిటీ, ప్రీ రిలీజులు, రిలీజులు, పోస్ట్ ప్రచారాలతో బిజీ బిజీగా కనిపించారు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. ఓ వైపు రాజకీయాల్లో అంత బిజీగా ఉన్నా, సినిమాల కోసం ఆయన కేటాయిస్తున్న టైమ్‌ చూసి ముచ్చటపడిపోయారు ఫ్యాన్స్. ఈ జోరు ఇలాగే కంటిన్యూ అయితే బావుంటుందని గట్టిగా అనుకున్నట్టున్నారు.. ఇప్పుడు అది నిజమయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయంటోంది పవర్‌స్టార్‌ కాంపౌండ్‌. ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ రిలీజ్‌ అయ్యాక పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఏం చేస్తారు? సినిమాల్లో కంటిన్యూ అవుతారా? లేదా? అనే డైలమాకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేశారు సురేందర్‌ రెడ్డి. ఫిబ్రవరి నుంచి పవన్‌ కల్యాణ్‌ సినిమా స్టార్ట్ చేస్తారు సురేందర్‌రెడ్డి. ఆల్రెడీ అన్నయ్యతో సైరా నరసింహారెడ్డి తెరకెక్కించిన సురేందర్‌ రెడ్డి, తమ్ముడు కోసం ఏం ప్లానింగ్‌ చేస్తున్నారోననే ఆసక్తి మాత్రం భలేగా కనిపిస్తోంది ఆడియన్స్ లో. రామ్‌ తాళ్లూరి నిర్మాతగా తెరకెక్కుతుంది సురేందర్‌ రెడ్డి మూవీ. ఈ సినిమా కోసం పవర్‌స్టార్‌ సెపరేట్‌ హెయిర్‌ స్టైల్‌ మెయింటెయిన్‌ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అభిమానులకు కిక్ ఇచ్చేలా స్క్రిప్ట్ వచ్చిందన్నది సురేందర్‌ వైపు నుంచి వినిపిస్తున్న మాట. ఓ వైపు సురేందర్‌ రెడ్డి సినిమాలో నటిస్తూనే, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ రిలీజ్‌ ప్రమోషన్ల మీద కూడా ఫోకస్‌ చేస్తారట పవర్‌స్టార్‌. మరోవైపు ప్రొడక్షన్‌ మీద కూడా దృష్టి పెడతారన్నది ఆల్రెడీ ఉన్న టాక్‌. దాంతో పాటు మరో కొత్త ప్రాజెక్టుకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయట. ఇదే జరిగితే… టైమ్‌ని పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేయడం ఎలాగో పవర్‌స్టార్‌ని చూసి చాలా మంది నేర్చుకోవాల్సిందేనంటూ కాలర్‌ ఎగరేస్తున్నారు ఫ్యాన్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nithiin: జానర్ మార్చిన నితిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా

నయన్‌కి హిట్‌ ఇచ్చిన చిరు.. మరి త్రిష మాటేంటి

Kethireddy Venkatarami Reddy: వైసీపీ నేతలు కేసులకు భయపడే రోజులు పోయాయి

Gold and Silver: జెట్ స్పీడుతో దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు

అమరావతి రైతులకు ‘ప్లాట్’ పండుగ.. ఉండవల్లి రైతులకు ఎట్టకేలకు మోక్షం