Poonam Kaur: ఆయన క్యారెక్టర్ ఉన్న హీరో… ప్రభాస్ పై పూనమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల కంటే వివాదాలతో పాపులర్ అవుతుంది హీరోయిన్ పూనమ్ కౌర్. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఆమె చేసే కామెంట్స్.. ట్వీట్స్ మాత్రం తెగ వైరల్ అవుతుంటాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల కంటే వివాదాలతో పాపులర్ అవుతుంది హీరోయిన్ పూనమ్ కౌర్. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఆమె చేసే కామెంట్స్.. ట్వీట్స్ మాత్రం తెగ వైరల్ అవుతుంటాయి. ఇక చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ.. తాజాగా నాతి చరామి సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొంటున్న పూనమ్… ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.