Pooja Hegde: కోలీవుడ్‌నే నమ్ముకున్న బుట్టబొమ్మ

Edited By:

Updated on: Nov 06, 2025 | 5:12 PM

ఆ మధ్య సౌత్‌ నార్త్ ఇండస్ట్రీల్లో సూపర్ ఫామ్‌లో కనిపించిన పూజా హెగ్డే తరువాత సడన్‌గా స్లో అయ్యారు. వరుస ఫెయిల్యూర్స్‌తో అమ్మడి కెరీర్‌ గాడి తప్పింది. దీంతో అవకాశాలు కూడా చేజారాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ ఫామ్‌లోకి వస్తున్న ఈ బ్యూటీ, కెరీర్‌ మీద సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు. ఈ టైమ్‌లో ఒకే ఇండస్ట్రీ నుంచి వరుస ఆఫర్స్‌తో బిజీ అవుతున్నారు బుట్టబొమ్మ.

రాధేశ్యామ్ రిలీజ్‌కు ముందు కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్నారు పూజా హెగ్డే. కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ అరవింద ఆశలు ఆవిరి చేసేసింది. రాధేశ్యామ్‌ సూపర్ హిట్ అయితే పాన్ ఇండియా హీరోయిన్‌గా బిజీ అవ్వొచ్చని భావించిన బుట్టబొమ్మకు షాక్ తగిలింది. ఆ తరువాత నార్త్ సినిమాలు కూడా ఫెయిల్ అవ్వటంతో పూజా కెరీర్‌ పూర్తిగా గాడి తప్పింది. కొంత కాలం సౌత్, నార్త్ ఇండస్ట్రీలో పూజ పేరే వినిపంచలేదు. ఈ పరిస్థితుల్లో తమిళ సినిమా అరవిందకు మళ్లీ ఛాన్స్ ఇచ్చింది. రెట్రో సినిమాలో చేసిన వింటేజ్‌ రోల్‌, కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్‌ పూజ పేరును మరోసారి ట్రెండింగ్‌లోకి తీసుకువచ్చాయి. తనకు మళ్లీ లైఫ్ ఇచ్చిన కోలీవుడ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు పూజ. ప్రజెంట్ ఈ బ్యూటీ చేస్తున్న సినిమాల్లో ఎక్కువగా తమిళ సినిమాలే ఉన్నాయి. విజయ్ జననాయగన్ షూటింగ్ ఆల్రెడీ పూర్తయ్యింది. లారెన్స్ కాంచన – 4లో నటిస్తున్న విషయం ఆల్రెడీ కన్ఫార్మ్ అయ్యింది. ఇప్పుడు మరోక్రేజీ ప్రాజెక్ట్ ఈ బ్యూటీ కిట్టీలో చేరింది. ధనుష్ హీరోగా అమరన్‌ ఫేమ్‌ రాజ్‌కుమార్ పెరియాసామి రూపొందిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా పూజ హెగ్డే పేరునే ఫైనల్ చేశారట మేకర్స్. పర్ఫామెన్స్‌కు స్కోప్‌ ఉన్న పాత్ర కావటంతో పూజ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. తెలుగులోనూ దుల్కర్‌కు జోడీగా ఓ సినిమా చేస్తున్నారు ఈ బ్యూటీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

AA22: ఏఏ 22 అప్‌డేట్‌.. బన్నీ కన్ఫార్మ్ చేసినట్టేనా ??

Akshay Kumar: అక్షయ్ డెడికేషన్ గురించి చిన్ని ప్రకాష్ కామెంట్

శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ.. రన్‌వే అవసరం లేని విమానం

టెన్త్‌ అర్హతతో రైల్వే ఉద్యోగం.. రాత పరీక్ష లేకుండానే

అయ్యో..రక్షించేవారే లేరా.. ఏనుగుల ఆక్రందన

Published on: Nov 06, 2025 05:11 PM