Pooja Hegde: నయా స్ట్రాటజీ ఫాలో అవుతున్న పూజా

Edited By: Phani CH

Updated on: Oct 29, 2025 | 2:53 PM

విజయాన్ని డీకోడ్‌ చేయడం అంత ఈజీ కాదు. అందులోనూ సినిమా ఇండస్ట్రీలో అది సులభం కాదు. అయినా ఆ ట్రయల్స్ లోనే ఉన్నారు మిస్‌ పూజా. ఒకరినీ, ఇద్దరినీ కాదు.. కొంత మంది సక్సెస్‌ ట్రాక్‌ని స్టడీ చేసి మరీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. ఇంతకీ జిగేల్‌ రాణి తీసుకున్న తాజా నిర్ణయం ఏంటి? అది కెరీర్‌కి ఎంత వరకు ప్లస్‌ అవుతుంది? ముఖ్యంగా ముంబై వీధుల్లో దాని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఓజీ డైరక్టర్ నెక్స్ట్ నానితో తీస్తున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారన్నది రీసెంట్‌ వార్త.

విజయాన్ని డీకోడ్‌ చేయడం అంత ఈజీ కాదు. అందులోనూ సినిమా ఇండస్ట్రీలో అది సులభం కాదు. అయినా ఆ ట్రయల్స్ లోనే ఉన్నారు మిస్‌ పూజా. ఒకరినీ, ఇద్దరినీ కాదు.. కొంత మంది సక్సెస్‌ ట్రాక్‌ని స్టడీ చేసి మరీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. ఇంతకీ జిగేల్‌ రాణి తీసుకున్న తాజా నిర్ణయం ఏంటి? అది కెరీర్‌కి ఎంత వరకు ప్లస్‌ అవుతుంది? ముఖ్యంగా ముంబై వీధుల్లో దాని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఓజీ డైరక్టర్ నెక్స్ట్ నానితో తీస్తున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారన్నది రీసెంట్‌ వార్త. నేచురల్‌ స్టార్‌ సినిమాను ప్యాన్‌ ఇండియా లెవల్లో ప్లాన్‌ చేస్తున్నారు ఓజీ కెప్టెన్‌. అంటే ఎన్నాళ్లుగానో పూజా ఎదురుచూస్తున్న సక్సెస్‌ ఈ సినిమాతో దక్కినట్టేనా? సుజీత్‌ కెప్టెన్సీలో పూజా గట్టున పడితే.. గత కొన్నేళ్లుగా కనిపిస్తున్న ఆనవాయితీ కంటిన్యూ అయినట్టే అనుకోవాలి. నార్త్ లో తడబడుతున్న రష్మిక కెరీర్‌ని సక్సెస్‌ ట్రాక్‌లో పెట్టిన ఘనత సందీప్‌ రెడ్డి వంగాకి సొంతం. యానిమల్‌లో రష్మిక కేరక్టర్‌ని పెక్యులియర్‌గా తీర్చిదిద్దారు సందీప్‌. యానిమల్‌తో సూపర్‌ డూపర్‌ పెర్ఫార్మర్‌గా నార్త్ లో నిలదొక్కుకున్నారు రష్మిక మందన్న. ఆ తర్వాత జవాన్‌తో నార్త్ లో ఫస్ట్ బాల్‌కి సిక్స్ కొట్టేశారు నయన్‌. అట్లీ డైరక్షన్‌లో ది బెస్ట్ అనిపించుకున్నారు లేడీ సూపర్‌స్టార్‌.అట్లీ వల్ల నార్త్ లో ఫేమస్‌ అయింది జస్ట్ నయన్‌ మాత్రమే కాదు.. కీర్తీ సురేష్‌ కూడా. పెళ్లైన కొత్తలో నార్త్ లో తన సినిమాను ప్రమోట్‌ చేసుకుని ఎంత కమిట్‌మెంట్‌ ఉంది ఈ అమ్మాయికి.. అని మంచి పేరు తెచ్చుకున్నారు కీర్తి. ఇప్పుడు వీళ్లందరి బాటలోనే పూజా హెగ్డే నడవాలని ఫిక్సయ్యారా? సౌత్‌ డైరక్టర్‌ ని నమ్ముకుంటే నార్త్ లో నిలదొక్కుకోవచ్చని భావిస్తున్నారా? ఆమె మనసులో ప్లానింగ్‌ ఎలా ఉన్నా.. ఫిల్మోగ్రఫీలో ఫోర్త్ కమింగ్‌ రిలీజుల లిస్టు బలంగా కనిపిస్తోంది. సో.. ఎలాగైనా మళ్లీ నెంబర్‌ వన్‌ ప్లేస్‌ని ఆక్యుపై చేసేయాలన్న పట్టుదలతో కనిపిస్తున్నారు పూజా.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kriti Sanon: మంచి కాన్సెప్టులతో పలకరిస్తానన్న కృతి సనన్

Mohanlal: త్వరలో దృశ్యం త్రీక్వెల్ సెట్‌ కు మోహన్ లాల్‌

సంక్రాంతికి రంగంలోకి దిగుతున్న మెగాస్టార్, డార్లింగ్

బాలీవుడ్ బ్యూటీస్‌తో పోటీ పడలేకపోతున్న సౌత్ భామలు

టాలీవుడ్ షూటింగ్ అప్‌డేట్స్.. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న స్టార్స్

Published on: Oct 29, 2025 02:02 PM