ప్రధాని మోదీకి రామ్ చరణ్‌.. స్పెషల్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్

Updated on: Oct 13, 2025 | 5:23 PM

ప్రధాని మోదీని ఢిల్లీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ఉపాసన కలిశారు. ప్రధానితో శనివారం భేటీ అయ్యారు. రీసెంట్‌గా ఢిల్లీలో ఆర్చరీ లీగ్ గేమ్స్‌ మొదలయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఉపాసన తండ్రి అనిల్‌ కామినేని నిర్వహించారు. రామ్ చరణ్ అధికారికంగా లాంచ్ చేశారు. ఆర్చరీ లీగ్ సక్సెస్ సందర్భంగా మోదీని కలిసినట్లు రామ్‌చరణ్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. మన దేశంలో క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్ గేమ్స్‌కి లీగ్స్ ఉన్నాయి. ఈ ఏడాది తొలిసారి విలువిద్య లీగ్ పోటీలు ఢిల్లీలో ఉపాసన తండ్రి అనిల్‌ కామినేని ఆధ్వర్యంలో నిర్వహించారు. మొత్తం ఆరు జట్లు పాల్గొన్నాయి. తెలంగాణ, తమిళనాడు, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ టీమ్స్ పోటీ పడ్డాయి. చరణ్ సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్’తో వచ్చాడు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు అనిల్‌ కామినేని చేసిన కృషిని, ఆర్చరీకి ఆయన ఇచ్చిన మద్దతును గుర్తిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గతేడాది ఆయనను సత్కరించారు. సోషల్ మీడియా వేదికగా ఉపాసన ఫొటోలు కూడా పంచుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

NTRపై బాలీవుడ్ స్టార్ వివాదాస్పద వ్యాఖ్యలు !! బుద్ది చెప్పాల్సిందే

టెంపర్ సినిమా రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. ఫలితం NTR ఖాతాలో దిమ్మతిరిగే హిట్

వరస ప్రాజెక్ట్‌లతో సత్తా చూపిస్తున్న భీమ్స్

ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక.. మూడురోజులు భారీ వర్షాలు

పెళ్లి కాదు.. ఏకంగా హనీమూన్‌పై త్రిష పోస్ట్

Published on: Oct 13, 2025 05:15 PM