ఓజీ క్రేజ్‌.. జనసేన ఖజానాకు విరాళాలు

Updated on: Sep 23, 2025 | 4:46 PM

పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ ఓజీ రిలీజుకు ముందే సంచలనాలు క్రియేట్‌ చేస్తోంది. సెప్టెంబరు 25న గ్రాండ్‌గా విడుదలవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో అభిమానులు ఈ మూవీ బెనిఫిట్‌ షో టికెట్లను భారీ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఏకంగా టికెట్లకు వేలం నిర్వహిస్తూ మొదటి షో మొదటి టికెట్‌ను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు.

అలా టికెట్ల వేలం ద్వారా లభించిన నగదును జనసేన పార్టీకి విరాళంగా అందిస్తున్నారు. ఓజీ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు, తమ ఆరాధ్య నటుడి రాజకీయ పార్టీ జనసేన కు మద్దతు తెలుపుతూ వినూత్న కార్యక్రమం చేపట్టారు. అభిమాన సంఘాలు ‘ఓజీ’ ఫస్ట్ డే టిక్కెట్లను వేలం వేసి, అందిన మొత్తాన్ని పార్టీకి విరాళంగా అందించారు. వివిధ ప్రాంతాల్లో వేలం ద్వారా సేకరించిన లక్షల రూపాయలను చెక్కుల రూపంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు కు అభిమానులు అందజేశారు. ఈ క్రమంలో, బెంగళూరుకు చెందిన అభిమానులు ఏకంగా 3.61 లక్షల రూపాయ‌ల‌ను విరాళంగా సేక‌రించారు. చెన్నై అభిమానులు రూ.1.72 లక్షలు , చిత్తూరు జిల్లా అభిమానులు రూ. 1 లక్ష జనసేన ఖజానాకు అందించారు. అభిమానుల ఈ అంకితభావం, రాజకీయంగా కూడా ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. నిధులను స్వీకరించిన నాగబాబు, అభిమానుల నిబద్ధతను ప్రశంసిస్తూ, “పవన్ కల్యాణ్‌పై అభిమానులకు ఉన్న అపారమైన మద్దతు ఆయన రాజకీయ ప్రస్థానానికి పెద్ద బలమవుతుంది” అని పేర్కొన్నారు. సినిమా రంగంలో పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ను రాజకీయ రంగంలోనూ మద్దతుగా మలుస్తున్న అభిమానులు, తన సినిమా విడుదల వేడుకను కేవలం సెలబ్రేషన్‌గానే కాకుండా, పార్టీకి అండగా నిలిచే అవకాశంగా మలచుకున్నారు. కాగా తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో OG సినిమా బెనిఫిట్ షో మొదటి టికెట్ పవన్‌ కళ్యాణ్‌ అభిమాని ఆముదాల పరమేష్‌ 1,29,999రూపాయల కు టికెట్‌ దక్కించుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేశమంతా 9 రోజులు.. అక్కడ మాత్రం ఒక్కరోజే దసరా

కొబ్బరిబోండాల లారీ బోల్తా.. సంచులతో ఎగబడిన జనం

దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన జీఎస్టీ 2.o.. ఏ వస్తువుల ధరలు ఎంతెంత అంటే..

విమానంలో ఎలుక.. కేకలు పెట్టిన ప్రయాణికులు

సూర్యుడిని రెండుగా చీలుస్తూ నింగికి ఎగిసిన ఫాల్కన్‌.. అదిరిపోయే ఫొటోను చూసారా