పెద్ది తెలుగు రికార్డులను కొల్లగొట్టిన పవన్ కల్యాణ్

Edited By:

Updated on: Dec 17, 2025 | 4:11 PM

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి పవన్ కల్యాణ్ నటించిన దేఖ్ లెంగే పాట తెలుగు రికార్డులను బద్దలుకొట్టింది. విడుదలైన 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, చికిరి పాట పేరు మీదున్న మునుపటి రికార్డును అధిగమించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, హరీష్ శంకర్ దర్శకత్వం, పవర్ స్టార్ నటనతో ఈ పాట వైరల్ అయ్యింది.

వ్యూస్‌ నీ, లైక్స్ నీ బట్టి సాంగ్‌ ఎంత పెద్ద హిట్‌ అయిందో అంచనాలకు వచ్చే ట్రెండ్‌లో ఉన్నాం. అందుకే క్రేజ్‌ ఉన్న సాంగ్స్ రిలీజ్‌ అయిన ప్రతిసారీ, రికార్డు బ్రేక్‌ చేసిందా లేదా? అంతకు ముందున్న రికార్డు ఎంత? ఇప్పుడు ఎంతలో బీట్‌ చేసిందనే మాటలు వైరల్‌ అవుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా దేఖ్‌ లేంగే.. పాట తెలుగు రికార్డుల గురించి ఆడియో ఇండస్ట్రీలో మోత మోగుతోంది. ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ మూవీ నుంచి దేఖ్‌ లేంగే సాంగ్‌ రిలీజ్‌ అయింది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతంలో వైరల్‌ అవుతోంది సాంగ్‌. హరీష్‌ శంకర్‌ డైరక్షన్‌లో పవర్‌స్టార్‌ నటించే సినిమాకు దేవిశ్రీ బీట్‌ ఇస్తే వేరే రేంజ్‌లో ఉండాల్సిందేనని, దేఖ్‌లేంగే ఆ విషయాన్నే ప్రూవ్‌ చేసిందని అంటున్నారు ఫ్యాన్స్. దేఖ్‌లేంగే… పాట విడుదలైన 24 గంటల్లో 29.6 మిలియన్లకు పైగా వ్యూస్‌ని సొంతం చేసుకుంది. అంతకు ముందు చికిరి సాంగ్‌ పేరు మీదున్న తెలుగు రికార్డులను తుడిచిపెట్టేసింది దేఖ్‌లేంగే పాట. చికిరి సాంగ్‌ విడుదలైన 24 గంటల్లో తెలుగులో 29 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించింది. పది లక్షలకు పైగా లైక్‌లు కూడా తెచ్చుకుంది. రిలీజ్‌ అయిన 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి చికిరి సాంగ్‌కి 46 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. అప్పటి వరకూ ఉన్న కిస్సిక్‌ సాంగ్‌ రికార్డును బ్రేక్‌ చేసింది చికిరి సాంగ్‌. పుష్ప సినిమాలోని కిస్సిక్‌ సాంగ్‌ కి 27.19 మిలియన్ల వ్యూస్‌ సొంతమయ్యాయి. ఐకాన్‌స్టార్‌ – సుకుమార్‌ సినిమాల్లో స్పెషల్‌ సాంగులకున్న క్రేజ్‌ ఏంటో, శ్రీలీల స్టెప్పులకున్న గ్రేస్‌ ఏంటో అప్పట్లో ఆ పాట చెప్పకనే చెప్పేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మార్చి యుద్ధం.. 2 వారాల్లో 4 పాన్ ఇండియా సినిమాలు

హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??

Vijayawada: బెజవాడ రైల్వే స్టేషన్‌లో పార్కింగ్‌ దోపిడీ

డీమాన్‌ని ఢీ కొట్టి బొక్కబోర్లా పడ్డ కళ్యాణ్.. తనూజ దెబ్బకు షాక్‌లోకి

Pawan Kalyan: పవన్‌ డ్యాన్స్‌ ఎఫెక్ట్‌ షేక్ అవుతున్న సోషల్ మీడియా..