నెల తిరగకుండానే OTTలోకి OG ?? బయటికొచ్చిన డేట్ !!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా దసరా పండగ కానుకగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. స్టైలిష్ గ్యాంగ్ స్టర్ గా పవన్ కల్యాణ్ స్వాగ్, విలన్ గా ఇమ్రాన్ హష్మీ నటన, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీక్వెన్స్, తమన్ BGM's ఓజీ సినిమా సక్సెస్‌కి బిగ్గెస్ట్ అసెట్స్‌గా నిలిచాయి.
పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా హిస్టరీకెక్కేలా చేశాయి. ఇక అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్నట్టుగా న్యూస్. ఓజీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నెల రోజుల్లోనే ఓటీటీలో విడుదల అయ్యేలా ఆ సంస్థతో ఓజీ మేకర్స్ ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం అక్టోబర్ 23 నుంచి ఓజీ సినిమా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. సెన్సార్ కారణంగా ఓజీ థియేట్రికల్ వెర్షన్ లో కొన్ని సీన్లకు కత్తెర పడింది. అయితే ఓటీటీ వర్షన్‌లో ఆ అదనపు సీన్లను కూడా మేకర్స్ యాడ్ చేస్తారని తెలుస్తోంది. అలాగే నేహా శెట్టి స్పెషల్ సాంగ్ కూడా ఉండనుందని తెలుస్తోది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావల్సి ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
