Hari Hara Veera Mallu Pre Release Event : హరిహరవీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ – పవన్ ఎంట్రీ అదుర్స్
పవన్‌కల్యాణ్ హరిహర వీరమల్లు ఈ నెల 24న విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద్రాబాద్ శిల్పకళా వేదికలో జరుగుతోంది. కార్యక్రమానికి కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే, ఏపీ సినిమాటోగ్రఫ్రీశాఖ మంత్రి కందుల దుర్గేశ్, తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరవుతున్నారు.
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్‌కి ఇవాళ పవర్‌ఫీస్ట్ రెడీగా ఉంది. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ శిల్పకళా వేదికైంది. రాత్రి 10 గంటల వరకు జరిగే ఈ వేడుక కోసం తెలుగు రాష్ట్రాల నలుమూలలనుంచి అభిమానులు హాజరయ్యారు. ఇప్పటికే శిల్పకళావేదిక వెలుపల జనసందోహంతో నిండిపోయింది.
వీలైనంత తక్కువ మందితో కార్యక్రమం చేసుకోవాలని సూచిస్తూ, ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేసే బాధ్యత చిత్ర యూనిటే తీసుకోవాలని క్లారిటీనిస్తూ ఈవెంట్‌కు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా నిర్మాతే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈవెంట్ పాస్‌ల కోసం ఫ్యాన్స్‌లో విపరీతమైన డిమాండ్ ఉండడంతో…1500 మందికి మించకుండా చూసుకోవాలని ఆదేశించారు.
కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే, ఏపీ సినిమాటోగ్రఫ్రీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్, తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. దీంతో సినిమాటిగ్గానే కాదు పొలిటికల్‌గానూ సెన్సేషన్‌గా మారింది హరిహర వీరమల్లు వేడుక. పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు ఈనెల 24న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
ఈవెంట్ నిర్వహణకు సంబంధించి పోలీసులు పలు ఆంక్షలు విధించారు. 1000-1500 మందిని మాత్రమే ఈవెంట్‌కు అనుమతించాలని పోలీసులు సూచించారు. పార్కింగ్, క్రౌడ్ కంట్రోల్ బాధ్యత పూర్తిగా నిర్మాతే చూసుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా నిర్మాతే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఈవెంట్ సజావుగా సాగడానికి 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. పవన్‌కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో హరి హర వీరమల్లుపై
భారీ అంచనాలు ఉన్నాయి.
