Pawan Fans: త్రివిక్రమ్‌ మెడకు చుట్టుకున్న ఇష్యూ.. ఆడేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్‌.

Updated on: Aug 02, 2023 | 10:00 AM

త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు. అలవోకగా..అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడేంత కెపాసిటీ ఉన్నవారు. తన స్కిప్ట్ తో.. స్క్రీన్‌ ప్లేతో.. అందర్నీ కట్టిపడేస్తారనే టాక్ తెచ్చుకున్నారు. సిల్వర్ స్క్రీన్‌ పై వండర్స్ కూడా క్రియేట్ చేశారు. ఓ పక్క డైరెక్టర్‌గా పనిచేస్తూనే రైటర్‌గా కూడా... దసుకుపోతున్నారు. కానీ కట్ చేస్తే.. తాజాగా మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ కారణంగా నెట్టింట విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. కార్నర్‌కు గురవుతున్నారు.

సముద్రఖని డైరెక్షన్లో వచ్చిన బ్రో మూవీ ఓ పక్క హిట్ టాక్ తెచ్చుకుంది. వింటేజ్ పవన్‌ను గుర్తుకు వచ్చేలా చేసింది. పవన్‌ ఫ్యాన్స్‌ను హిలయరెస్‌ గా అలరించింది. 100కోట్ల మార్క్‌ను కూడా టచ్‌ చేసింది. కానీ దాంతో పాటే ఇది పవన్‌ రేంజ్‌ సినిమా కాదనే టాక్ కూడా కొందరి నుంచి బయటికి వచ్చింది. ఇక టాకే అటు తిరిగి.. ఇటు తిరిగి ఇప్పుడు త్రివిక్రమ్ మెడకు చుట్టుకుంది. అలా త్రివిక్రమ్ మెడకు చుట్టుకున్న కారణాల్లో.. బ్రో సినిమాకు స్క్రీన్‌ప్లే అండ్ డైలాగ్స్‌ త్రివిక్రమ్‌ అందించడం ఒకటైతే.. అసలు ఈ సినిమాను పవర్ స్టార్ చేయడానికి త్రివిక్రమే కారణం రెండోది. ఇక ఈ రెండు కారణాల వల్లే.. ఈ సినిమా పై కాస్త అసంతృప్తిగా ఉన్న కొంత మంది పవన్‌ డై హార్డ్ ఫ్యాన్స్‌ .. త్రివిక్రమ్‌నే కార్నన్ చేస్తూ.. నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. త్రివిక్రమ్‌ షాడో వల్లే పవన్‌ ఇలాంటి సినిమాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...